ఎంటర్టైన్మెంట్ వెబ్ పోర్టల్, ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్ జ్యాపి(Xappie) చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. జ్యాపి యాప్ ని రూపొందించిన ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే, కృష్ణ గొర్రెపాటి 'జ్యాపి స్టూడియోస్' పేరుతో నిర్మాణ సంస్థని స్థాపించారు.
బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి, దర్శకుడు అనుదీప్, నిర్మాత కె ఎల్ దామోదర్ ప్రసాద్, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామక్రిష్ణ, రాజా రవీంద్ర, ముఖ్య అతిధులుగా బ్యానర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. వేడుకగా జరిగిన బ్యానర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు అనిల్ రావిపూడి 'జ్యాపి స్టూడియోస్' బ్యానర్, పోస్టర్ ని లాంచ్ చేశారు. 'జ్యాపి స్టూడియోస్' లాంచ్ ఈవెంట్ లో మొత్తం నాలుగు చిత్రాలని ప్రకటించారు నిర్మాతలు.
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సినిమా నిర్మాణం రంగంలోకి అడుగుపెతున్న 'జ్యాపి స్టూడియోస్' మంచి విజయాలని సాధించాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీ ప్రస్తుతం క్లిష్ట సమయాన్ని ఎదుర్కోటుంది. అందరూ ఫైట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన 'జ్యాపి స్టూడియోస్'కి బెస్ట్ విసెష్'' తెలిపారు.
రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. జ్యాపి స్టూడియోస్'కి ఆల్ ది బెస్ట్ . 'జ్యాపి స్టూడియోస్' నిర్మాణంలో ఒక సినిమా చేయబోతున్నా. కథ చాలా బావుంది. షూటింగ్ కోసం ఎక్సయిటింగా ఎదురుచూస్తున్నా. టైటిల్ తో పాటు మిగతా వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. మిగతా ప్రాజెక్ట్స్ కి కూడా ఆల్ ది వెరీ బెస్ట్' తెలిపారు.
సుహాస్ మాట్లాడుతూ.. రామ్ పసుపులేటితో ఐదేళ్ళుగా ట్రావెల్ చేస్తున్నా. ఫైనల్ గా అందరికీ నచ్చిన కథ ఓకే అయ్యింది. ఇది ఫాంటసీ డ్రామా. మీ అందరికీ చూపించాలని ఎదురు చూస్తున్నాను'' అన్నారు
నిర్మాత ఉదయ్ కోలా మాట్లాడుతూ.. 2019లో జ్యాపి ఎంటర్టైన్మెంట్ పోర్టల్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ స్టార్ చేశాం. ఇండస్ట్రీని అవగాహన చేసుకున్నాం. సినిమాలు డిజిటల్ ప్రమోషన్స్ కూడా చేశాం. తర్వాత యూట్యూబ్ వీడియో కంటెంట్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేశాం. ఫైనల్ గా మన కోసం మనమే కంటెంట్ ని బిల్డ్ చేసుకోవాలని నిర్ణయించాం. చాలా కంటెంట్ బిల్డ్ అయ్యింది. సంజీవ్ రెడ్డి, నాని బండ్రెడ్డి , డైరెక్టర్ ఆదినారాయణ, చైతన్య, ఆర్కే వీళ్ళంతా మా ప్రయాణంలో తోడుగా నిలబడ్డారు. ప్రేక్షకులందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను'' అన్నారు.
నిర్మాత దామోదరప్రసాద్, ధన్య బాలకృష్ణ, చైతన్య, రాజా రవీంద్ర తదితరులు పాల్గొని ప్రసంగించారు.