‘మెగా’ ట్రోలింగ్ సరైనదేనా?

జస్టిస్ ఫర్ కొరటాల అంటూ సోషల్ మీడియా కాంపయిన్ ఒక పక్క… అందులో భాగంగానే పరోక్షంగా మెగాస్టార్ ను ట్రోల్ చేయడం ఇంకోపక్క. ఆచార్య నష్టాల వివాదంలో దర్శకుడు కొరటాల శివ కు సానుభూతి…

జస్టిస్ ఫర్ కొరటాల అంటూ సోషల్ మీడియా కాంపయిన్ ఒక పక్క… అందులో భాగంగానే పరోక్షంగా మెగాస్టార్ ను ట్రోల్ చేయడం ఇంకోపక్క. ఆచార్య నష్టాల వివాదంలో దర్శకుడు కొరటాల శివ కు సానుభూతి దక్కేలా ‘జస్టిస్ ఫర్ కొరటాల’ అంటూ ట్రెండింగ్ మరోపక్క. 

నిజానికి ఇందులో మెగాస్టార్ తప్పేం వుంది? అన్నది పాయింట్. హీరో రెమ్యూనిరేషన్ తీసుకుంటారు. డైరక్టర్ చెప్పిన కథ నచ్చితే సినిమా చేస్తారు. సినిమా కర్త, కర్మ, క్రియ అంతా దర్శకుడే. ఒక వేళ మెగాస్టార్ సినిమాను కెలికేసి వుంటే ఆ విషయం ఏదో విధంగా వెల్లడయ్యేలా చూడొచ్చు.

ఆచార్య విషయాలను మొదటి నుంచి అవలోకిస్తే..

ఆచార్య సినిమాను జాయింట్ వెంచర్ గా చేయాలనుకున్నారు మొదట. కానీ అప్పటికి మల్టీ స్టారర్ కాదు. సైరా తరువాత పరిస్థితులు మారడంతో జాయింట్ వెంచర్ వద్దు అనుకున్నారు మెగా హీరోలు. కేవలం బ్యానర్ ను హైప్ కోసం యాడ్ చేసారు. కానీ జాయింట్ వెంచర్ అన్నట్లే ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. 

సినిమా నిర్మాణం పూర్తవుతూ వుంటే ఖర్చు పెరుగుతూ వస్తోంది. వడ్డీలు పెరుగుతున్నాయి. ఈ దశలో నిరంజన్ రెడ్డి కి నాలుగు కోట్లు ఇచ్చి కొరటాల ప్రాజెక్టును తీసేసుకున్నారు. ఇది తెర వెనుకాల సంగతి అయినా, గ్యాసిప్ ల్లో వినిపిస్తూనే వచ్చింది. ఆ విధంగా ఇక ప్రాజెక్టు లాభ నష్టాలు అన్నీ కొరటాలవే.

సినిమాను మంచి రేట్లకే మార్కెట్ చేసారు. నాన్ థియేటర్ అమ్మారు. కానీ కాజల్ వ్యవహారం, సినిమా ఫ్లాప్ కావడంతో 7.5 కోట్లు ఆదాయం తగ్గిపోయింది. మెగా హీరోలు ఇద్దరూ కలిసి 60 కోట్లు తీసుకున్నారని టాక్. కానీ ఇరవై కోట్లు వెనక్కు ఇచ్చారని విశ్వసనీయ వర్గాల బోగట్టా. 

కొరటాల కేవలం ఖర్చుల కింద నాలుగైదు కోట్ల వరకు వాడుకున్నారు. విడుదలకు ముందు సత్య రంగయ్యకు హామీ వుండాల్సి వచ్చింది. అప్పుడు కొరటాల నిర్మాతకు హామీ రాసిస్తే, నిర్మాత సత్య రంగయ్యకు రాసిచ్చారని వార్తలు వినవచ్చాయి.

ఇప్పుడు ఎవరికీ తెలియంది ఏమిటంటే.. 200 కోట్లకు పైగా మార్కెట్ చేసినపుడు ఎంత లాభం వచ్చి వుండాలి. చిరు 20 కోట్లు వెనక్కు ఇచ్చారు అంటున్నారు. ఇప్పటికి బయ్యర్లకు వెనక్కు ఇచ్చింది గట్టిగా 10 కోట్లు దాటలేదు మరింక కొరటాల ఇళ్లు,వాకిళ్లు అమ్మడం ఏమిటి? లాభం అంతా ఎక్కడికిపోయింది. 

మెగా స్టార్ వెనక్కు ఇచ్చింది ఏమయింది? ఈ లెక్కలు అన్నీ ఆ ముగ్గురికి తప్ప మరెవరికి తెలియదు. ఆ ముగ్గురు కొరటాల..మెగాస్టార్..నిర్మాత పెదవి విప్పనంత వరకు ఇలాంటి ట్రోలింగ్ లు, ట్రెండింగ్ లు తప్పవు.