హీరోహీరోయిన్లు డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక బ్రేక్ ఫాస్ట్ విషయానికొస్తే, వాళ్లదంతా వెరైటీగా ఉంటుంది. డైటీషియన్లు, న్యూట్రీషియన్లు చెప్పినట్టు మాత్రమే తింటారు. ప్రత్యేకంగా చెఫ్ లుంటారు వాటికోసం.
నిధి అగర్వాల్ విషయంలో అలాంటి పట్టింపులేం లేవు. పొద్దున్నే చద్దన్నం తినడం తనకు చాలా ఇష్టమంటోంది ఈ హీరోయిన్. రాత్రి మిగిలిపోయిన అన్నంలో నీరు పోస్తుంది, అందులో 2-3 పచ్చి మిర్చి వేస్తుంది. పొద్దున్న అందులో ఉప్పు కలుపుకొని లాగించేస్తుంది.
ఈ చద్దన్నమే తన బ్రేక్ ఫాస్ట్ అంటోంది నిధి అగర్వాల్. కన్నడలో దీన్ని కంజి అంటారంట. నిజానికి చద్దన్నం కంటే ముందు చాలా రకాలు ట్రై చేసిందంట. ప్రొటీన్ కోసం గుడ్లు కూడా తినేదంట.
అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏది తిన్నా తనకు పడలేదని, అందుకే ఎంచక్కా చద్దన్నంలోకి మారిపోయానని అంటోంది. పొద్దున్న చద్ది కూడు తిన్న తర్వాత, ఆ రోజంతా ఏం తిన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదంటోంది.
ఈ ఏడాది నిధి అగర్వాల్ కు చాలా కీలకం. ఆమె నటిస్తున్న హరిహర వీరమల్లు, రాజాసాబ్ సినిమాలు రెండూ ఈ ఏడాదిలోనే రిలీజ్ అవుతున్నాయి. నిజానికి హరిహర వీరమల్లు పూర్తయ్యేంతవరకు మరో సినిమా చేయకూడదనే నిబంధన అగ్రిమెంట్ లో ఉందంట. అందుకే చాలా సినిమాలు వదులుకున్నానని, కానీ ప్రభాస్ మూవీ ఆఫర్ మాత్రం వదులుకోలేకపోయానని, పవన్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని మరీ రాజాసాబ్ లో నటించానని తెలిపింది.
పవన్ నుండి ప్రత్యేకమైన అనుమత
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
veedi thaggali antaa, chaddanam is good food