ఏ సినిమాకు సరైన ప్రమోషన్ జరగాలంటే కేవలం పీఆర్ లేదా డిజిటల్ ఏజెన్సీలు మాత్రమే తలచుకుంటే సరిపోదు. దర్శకుడు, హీరో కూడా అనుకోవాలి. దర్శకుడు తన క్రియేటివిటీని వాడాలి. దానికి హీరో సహకరించాలి. ఈ రెండూ జరిగితేనే మంచి ప్రచారం వస్తుంది. మరో రెండు రోజుల్లో జనం ముందుకు రాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఇదే జరిగింది.
సినిమా నిర్మాణానికి ఎంత కష్టపడిపోయారో, ప్రచారానికి కూడా అంతే కష్టపడ్డారు. నిజానికి ప్రచారానికి విడుదల చేసిన మెటీరియల్ అంతా చూస్తే, “ఇదంతా ఎప్పుడు షూట్ చేసారా?” అన్న అనుమానం కలగడం సహజం.
ఈ ప్రచార మెటీరియల్ కోసం దర్శకుడు అనిల్ రావిపూడి తన శక్తి అంతా వాడి ఉండొచ్చు. కానీ, ఇలా చేయడానికి హీరో వెంకటేష్ ఇచ్చిన సహకారం మరే హీరో నుంచి ఆశించడం కష్టం. ప్రాజెక్ట్ మనసుకు పట్టేసినప్పుడే ఇంత చేయగలరు. వెంకటేష్‌తో పాటు హీరోయిన్లు ఇద్దరూ కూడా సమానంగా వీటి కోసం పనిచేశారు.
సినిమాకు ఇప్పుడు మంచి బజ్ వచ్చిందంటే, టికెట్లు బాగా అడ్వాన్స్‌గా అమ్ముడవుతున్నాయంటే కారణం కేవలం పాటలు హిట్ కావడం కాదు. ఈ ప్రచారం కూడా. ఒక దశలో పబ్లిసిటీ మరీ ఎక్కువైపోయిందన్న కామెంట్ సోషల్ మీడియాలో వినిపించింది. దానికి దర్శకుడు అనిల్ రావిపూడి బదులు ఇచ్చారు. “థియేటర్‌కి జనాల్ని రప్పించడం కోసం నేను రోడ్డు మీదకి వచ్చి ఏం చేయడానికైనా సిద్ధం” అన్నారు.
ఇదంతా చూసిన తర్వాత సినిమాలో వెంకటేష్ తప్ప ఎవరు చేసినా, ఈ రకం పబ్లిసిటీ జరగకపోయుండేదని అర్థమవుతుంది. స్టేజ్ మీద, టీవీ షోలలో, రీల్స్, స్కిట్స్ ఇలా అనేక రకాలుగా వెంకటేష్ అలరించారు. అదే ఇప్పుడు ఈ సినిమాకు ప్లస్ అయింది.
నిజానికి గేమ్ ఛేంజర్, ఢాకూ మహారాజ్‌లతో పోలిస్తే అంత స్టార్ అట్రాక్షన్ ఉన్న సినిమా కాదు. అంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కాదు. అయినా సంక్రాంతి బరిలో పోటీగా నిలవగలిగింది అంటే, కేవలం వెంకటేష్-అనిల్ రావిపూడిల కష్టమే.
రెండు పిల్లులు తగవు కోటి తీర్చిన చందాన bk సినిమా గట్టెక్కి ఉండొచ్చు..గేమ్ చెంజర్ డిజాస్టర్ అనేది దాని పాత్ర(అహం) వలన ఎప్పుడో అనుకున్నదే…
Fest ki 500c pakka. Paisa vasool. No prob
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు