నక్కిన – బెజవాడల మజాకా

నక్కిన త్రినాధరావు-బెజవాడ ప్రసన్నకుమార్ లది వీడదీయలేని బంధం. డైరక్టర్ గా ఆయనే వుండాలి. ఆయనకు రైటర్ గా ఈయనే వుండాలి. కానీ దర్శకుడిగా మారాలని ఓ ప్రయత్నం చేసారు బెజవాడ ప్రసన్న. ఓ తండ్రీ…

నక్కిన త్రినాధరావు-బెజవాడ ప్రసన్నకుమార్ లది వీడదీయలేని బంధం. డైరక్టర్ గా ఆయనే వుండాలి. ఆయనకు రైటర్ గా ఈయనే వుండాలి. కానీ దర్శకుడిగా మారాలని ఓ ప్రయత్నం చేసారు బెజవాడ ప్రసన్న. ఓ తండ్రీ కొడుకుల జంట ప్రేమకథలు అనే కాన్సెప్ట్ తో కథ రాసుకున్నారు. దాన్ని తీసుకుని తన ప్రయత్నాలు తాను చేసారు. కానీ మళ్లీ ఎందుకో నక్కిన త్రినాధరావు దగ్గరకే వచ్చి, తాను రైటర్ సీట్ లో వుండిపోయారు.

ఇప్పుడు ఆ కథే ‘మజాకా’ అనే సినిమాగా తెరకెక్కింది. రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమాలో సందీప్ కిషన్-రీతూ వర్మ జంటగా నటించారు. మరో జంటగా రావు రమేష్-అంషు నటించారు . అంషు గతంలో మన్మధుడు సినిమాలో హీరోయిన్ గా నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు తెరమీద కనిపించబోతున్నారు.

ఫిబ్రవరి 21న రాబోతున్న ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. అవుట్ అండ్ అవుట్ ఫన్ కాన్సెప్ట్ తో కట్ చేసారు టీజర్ ను. తండ్రిగా రావు రమేష్-కొడుకుగా సందీప్ కిషన్, వీరి జంట ప్రేమ కథలు అన్న కాన్సెప్ట్ టీజర్ లో కనిపించింది. బెజవాడ-నక్కిన మార్క్ ఫన్ చోటు చేసుకుంది. టీజర్ వదలడానికి రీజన్, సినిమా మీద ఓ ఇంప్రెషన్ అనేది ఇనీషియల్ గా కలిగించడం. ఆ మేరకు మజాకా టీజర్ టార్గెట్ ను రీచ్ అయింది. ఈ సినిమాకు ఫిబ్రవరి 21న బరిలోకి దింపుతున్నారు.

2 Replies to “నక్కిన – బెజవాడల మజాకా”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.