ప్ర‌జ‌లు కోరుకునేవి ప‌రిహారాలు, క్ష‌మాప‌ణ‌లు కాదు!

ప‌ర‌స్ప‌రం భిన్నంగా ఉన్నాయి స్పంద‌న‌లు. మ‌రి కూర్చుని మాట్లాడుకున్నాకా ఇద్ద‌రూ ఒక మాట మీద‌కు వ‌స్తారేమో కానీ, చెరో ర‌కంగా స్పందించి ప్ర‌జ‌ల్లో కూడా వీరు ఆలోచ‌న రేపారు.

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు అంటే అడ్మినిస్ట్రేష‌న్, అడ్మినిస్ట్రేష‌న్ అంటే చంద్ర‌బాబు నాయుడు! ఇదీ ఆయ‌న అనుకూలురు త‌ర‌చూ చేసే ప్ర‌చారం! అయితే అదేం విచిత్ర‌మో కానీ.. ఆయ‌న సీఎంగా ఉన్న‌ప్పుడు అడ్మినిస్ట్రేష‌న్ ఫెయిల్యూర్ వ‌ల్ల‌నే దారుణాలు జ‌రుగుతూ ఉంటాయి!

2014 నుంచి 2019 మ‌ధ్య‌న చంద్ర‌బాబు నాయుడు సీఎంగా ఉన్న‌ప్పుడు జ‌రిగిన పుష్క‌ర తొక్కిస‌లాట చ‌రిత్ర‌లో ఒక చెర‌గ‌ని మ‌ర‌క‌. ఏకంగా 26 మంది ప్రాణాల‌ను కోల్పోయారు నాటి ఘ‌ట‌న‌లో. అదంతా డాక్యుమెంట‌రీని తీసుకుని ప్ర‌చారం పొందే ప్ర‌య‌త్నంలో జ‌రిగిన ఘాతుకం అనే అభిప్రాయాలు కూడా అప్పుడు వినిపించాయి. వీడియోల కోసం, డ్రోన్ చిత్రీక‌ర‌ణ‌ల కోసం వేల మందిని ఒకేసారి వ‌దిలి అలాంటి ఘ‌ట‌న‌కు బాధ్యులు అయ్యార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే అలాంటిదేమీ లేద‌ని అప్పుడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌మే స్ప‌ష్టం చేసింది.

ఇక తాము అధికారంలో లేని కాలంలో టీటీడీ వ్య‌వ‌హారాల గురించి చంద్ర‌బాబు ఈ మ‌ధ్య‌నే తీవ్ర‌మైన ప్ర‌క‌ట‌న‌లు చేశారు. తిరుమ‌ల ల‌డ్డు విష‌యంలో ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న వివాదాస్ప‌దం అయ్యింది. చివ‌ర‌కు కోర్టు కూడా జోక్యం చేసుకుని.. రాజ‌కీయాల‌కు తిరుమ‌ల‌ను అయినా మిన‌హాయించ‌మంటూ వ్యాఖ్యానించింది. మ‌రి ల‌డ్డూ లో వాడే నెయ్యి క‌ల్తీ విష‌యంలో కోర్టు క‌మిటీ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది. మ‌రి ఆ క‌మిటీ ఏమైందో ఎవ‌రికీ తెలీదు. మ‌రి అంత తీవ్ర వివాదాస్ప‌ద విమ‌ర్శ చేసినాకా.. త‌ను ఇచ్చిన స్టేట్ మెంట్ ను నిరూపించుకోవాల్సిన బాధ్య‌త కూడా చంద్ర‌బాబుదే. అయితే ఆయన నియ‌మించిన కమిటీని కాకుండా.. కోర్టు క‌మిటీ తెర‌పైకి రావ‌డంతో ఆ వివాదంపై తెలుగుదేశం వ‌ర్గాలు కూడా స్పందించ‌డం మానేశాయి!

ఇక ఇంత‌లోనే తిరుప‌తి-తిరుమ‌ల చ‌రిత్ర‌లో లేని తొక్కిస‌లాట దుర్ఘ‌ట‌న చోటు చేసుకుంది. ద‌ర్శ‌నాల కోసం గంట‌ల త‌ర‌బ‌డి, 24 గంట‌ల‌కు మించి వేచి చూసిన వారు, క్యూలైన్ల‌లో ఓపిక‌గా ఎదురుచూడ‌ని వారంటూ ఉండ‌రు కానీ.. ఇలా తొక్కిస‌లాట ఉదంతాలు మాత్రం టీటీడీ చ‌రిత్ర‌లో లేవు. చివ‌ర‌కు ఆ దారుణం కూడా సోకాల్డ్ అడ్మినిస్ట్రేట‌ర్ చంద్ర‌బాబు నాయుడు సీఎం హోదాలో ఉండ‌గానే జరిగింది. అందునా టీటీడీ ప్ర‌క్షాళ‌న అనే ప‌దాన్ని ఇటీవ‌ల అధికారంలోకి వ‌చ్చిన‌ప్పటి నుంచి కూడా చంద్ర‌బాబు చాలా సార్లు వాడారు. ఆయ‌న‌కు అత్యంత అనుకూలురులే ఇప్పుడు టీటీడీలో ఉన్నారు. వారు స‌మ‌ర్థులైనా, అస‌మ‌ర్థులు అయినా.. వారిని ఎంపిక చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుకే చెందుతుంది.

అందునా టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విని తెలుగుదేశం పార్టీకి బాగా అనుకూలంగా ప‌ని చేసి పెట్టిన టీవీ చాన‌ల్ అధిప‌తికే క‌ట్ట‌బెట్టారు! అధికారం మారిన వెంట‌నే టీటీడీలో వ్య‌క్తులంతా మారిపోతూ ఉంటారు. ఆ మేర‌కు ఇప్ప‌టికే అంతా తెలుగుదేశం సానుకూలురే బోర్డులో కీల‌కంగా మారి ఆరు నెల‌లు గ‌డిచిపోయాయి! ఇప్పుడు జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబంధించి బాధ్య‌త కూడా చంద్ర‌బాబు ఎంపిక‌ల‌దే అవుతుంది!

అయితే తొక్కిస‌లాట త‌ర్వాత చంద్ర‌బాబు స్పంద‌న‌లో ప‌ర‌నింద‌లే క‌నిపించాయి! అలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జ‌రిగింది అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు! అయితే సీఎం హోదాలో కూర్చున్నాకా కూడా ఇంకా ప్ర‌శ్నించ‌డం, సీఎం ఎదుటే చైర్మ‌న్, అధికారులు వాదులుకున్నార‌నే వార్త‌లు వింత‌గా ఉన్నాయి! టీటీడీ అడ్మినిస్ట్రేష‌న్ వ్య‌వ‌హారాలు మ‌రింత దారుణంగా త‌యార‌య్యాయనే స‌త్యాన్ని మాత్రం భ‌క్త‌గ‌ణానికి అర్థ‌మ‌య్యేలా చేసింది తొక్కిస‌లాట‌. తిరుమ‌ల దేవుడిని రాజ‌కీయాల‌కు వాడుకోవ‌ద్ద‌ని కోర్టే వ్యాఖ్యానించాల్సి వ‌చ్చింద‌. మ‌రి రాజ‌కీయాల‌కు వాడుకునే దేవుడి విష‌యంలో అయినా బాధ్య‌త లేకుండా క‌నిపిస్తోంది వ్య‌వ‌హారం.

దానికి తోడు జ‌రిగిన ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి ఒక‌లా స్పందిస్తే, ఉప‌ముఖ్య‌మంత్రి ఇంకోలా స్పందించారు! ప‌ర‌స్ప‌రం భిన్నంగా ఉన్నాయి స్పంద‌న‌లు. మ‌రి కూర్చుని మాట్లాడుకున్నాకా ఇద్ద‌రూ ఒక మాట మీద‌కు వ‌స్తారేమో కానీ, చెరో ర‌కంగా స్పందించి ప్ర‌జ‌ల్లో కూడా వీరు ఆలోచ‌న రేపారు. చంద్ర‌బాబు వాళ్లూ వీళ్ల‌ను తిట్టేసి చేతులు దులుపుకునే ప్ర‌య‌త్నం చేస్తే, ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం క్ష‌మాప‌ణ‌లు అంటూ వ్య‌వ‌హారాన్ని డ్ర‌మ‌టైజ్ చేశారు. అయితే రెండూ ప్ర‌జ‌ల‌ను సంతృప్తి ప‌రిచేవి అయితే కాదు.

ప్ర‌జ‌లు కోరుకునేది ప‌రిహారాలు, స‌స్పెన్ష‌న్లు, క్ష‌మాప‌ణ‌లు కాదు. ప్ర‌జ‌లు కోరుకునేది నాయ‌కులు బాధ్య‌తాయుతంగా ఉంటార‌ని, వ్య‌వ‌స్థ‌ల‌ను స‌క్ర‌మంగా ప‌ని చేయిస్తార‌ని, అది జ‌ర‌గ‌న‌ప్పుడు.. ఈ పైపూత‌ల‌తో మ‌రింత మంటెక్కుతుంది త‌ప్ప ఉప‌యోగం ఉండ‌దు!

13 Replies to “ప్ర‌జ‌లు కోరుకునేవి ప‌రిహారాలు, క్ష‌మాప‌ణ‌లు కాదు!”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. It is not compensation or sorry that is needed. People need solutions that can ensure such negligence can be avoided. This include punishing the responsible and making irresponsible people accountable for their mistakes.

  3. BJP jagan ni duvvuthundi. Jagan modi pet . Amul paalu andhra lo teeskuravadaaniki tirumala laddu kathi ki BJP jagan karanam . Jagan pawan tho BJP rajakeeya game aduthondi . Laddu ghatana pai jagan mee eega valanivvadu modi . Adaani power meeda kudaa jagan ni emi peekaleru ., ee thokkilaasata kudaa BJP jagan la kutra kaavachu . Modi BJP jagan dwara pawan dwara cheyinche neecha rAajakeeyalu inkaa enno AP prajalu chustaru

  4. ఎదవ సోది! Cbn, pawan లాంటి అత్యుత్తమ కారెక్టర్ స్ ఇక్కడ వున్నంత కాలం..ఆంధ్రా ఇన్ సేఫ్ హాండ్స్..happy భోగి,సంక్రాంతి, కనుమ..జ..గ్గడు…లేని నిజమైన అచ్చమైన, స్వచ్చ మైన, తెలుగు మకర సంక్రాంతి💐👍

Comments are closed.