వ‌ర్ధ‌మాన హీరోయిన్‌ కంట క‌న్నీళ్లు

వ‌ర్ధ‌మాన హీరోయిన్‌, న‌వ వ‌ధువు కంట క‌న్నీళ్లు వ‌చ్చాయి.  భ‌ర్త పంపిన ఓ సందేశం త‌న కంట ఆనంద భాష్పాలు రాల్చేలా చేసింద‌ని ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా చెప్పుకొచ్చారు.  Advertisement భ‌ర్త మెసేజ్‌కు…

వ‌ర్ధ‌మాన హీరోయిన్‌, న‌వ వ‌ధువు కంట క‌న్నీళ్లు వ‌చ్చాయి.  భ‌ర్త పంపిన ఓ సందేశం త‌న కంట ఆనంద భాష్పాలు రాల్చేలా చేసింద‌ని ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా చెప్పుకొచ్చారు. 

భ‌ర్త మెసేజ్‌కు భావోద్వేగానికి గురైన‌ట్టు చెప్పిన ఆ వ‌ర్ధ‌మాన న‌టి మ‌రెవ‌రో కాదు ….మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల త‌న‌య నిహారిక‌. వివాహ‌మ‌నేది ఇరు కుటుంబాల భావోద్వేగంతో కూడిన అనుబంధం. పెళ్లికి ముందు క‌న్న క‌ల‌లు నెర‌వేరాయ‌ని మ‌న‌సు చెబితే, అంత‌కు మించిన సంతోష‌క‌ర క్ష‌ణాలు మ‌రేవి ఉండ‌వు.

గ‌త నెల‌లో చైత‌న్య‌తో ఏడ‌డుగులు న‌డిచిన నిహారిక సైతం పెళ్లి త‌న జీవితంలో నింపిన భావోద్వేగాల‌ను ఏ మాత్రం దాచుకోలేదు. తాజాగా ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా  ఓ వీడియో షేర్ చేశారు. 

పెళ్లి కుమార్తెగా రెడీ అవుతున్న క్ష‌ణాన త‌న కాబోయే జీవిత భాగ‌స్వామి నుంచి వ‌చ్చిన ఓ సందేశం త‌న‌ను ఎంతగా భావోద్వేగానికి గురి చేసిందో ఆ వీడియోలో చెప్పుకొచ్చారామె.

‘ప్రియమైన నిహా.. వివాహబంధంతో మన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో నీతో ఓ విషయాన్ని పంచుకోవాలనుకుం టున్నా. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని నా తుదిశ్వాస వరకూ గుర్తు పెట్టుకుంటా. 30 ఏళ్లుగా నేను ఏం కోల్పోయానో నిన్ను కలిసిన తర్వాత అర్థమైంది. అలాగే నేను నీ కోసమే పుట్టానని.. నా జీవితానికి అర్థం నువ్వేనని తెలిసింది’ అంటూ చైతన్య పంపిన‌ సందేశం చూసి నిహారిక భావోద్వేగానికి గురయ్యారు. 

బాధ‌లే కాదు, సంతోష క్ష‌ణాలు కూడా క‌న్నీళ్లు తెప్పిస్తాయ‌నేందుకు నిహారిక స్వీయానుభ‌వ‌మే నిద‌ర్శ‌నం.

నువ్వు ఒడిపోతే పార్టీ మూసివేస్తావా !

దృతరాష్టుడి మాదిరిగా మారిపోతారేమో?