మెగా డాటర్ నిహారి కొణెదల కోసం డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్టు నాగబాబు ఇదివరకే ప్రకటించాడు. దాదాపు 5 ప్రదేశాలు ఫైనల్ చేశామని, అందులో ఒక ప్లేస్ ను లాక్ చేస్తామని, ఆ బాధ్యతను వరుణ్ తేజ్ కు అప్పగించామని కూడా ప్రకటించాడు. ఇప్పుడా తేదీ, వేదిక ఖరారైంది.
నిహారిక, చైతన్యల పెళ్లి రాజస్థాన్ లో జరగనుంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఉన్న ఉదయ్ విలాస్ రిసార్ట్ లో నిహారిక పెళ్లి జరుగుతుంది. డిసెంబర్ 9, రాత్రి 7 గంటలకు నిహారిక-చైతన్య పెళ్లితో ఒకటి కాబోతున్నారు.
నిహారిక-చైతన్యల నిశ్చితార్థాన్ని హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో నిర్వహించారు. ఓవైపు ఇంకా కరోనా ఉండడంతో, పెళ్లిని కూడా హైదరాబాద్ లోనే సింపుల్ గా నిర్వహిస్తారని అంతా భావించారు. కానీ మెగా ఫ్యామిలీ మాత్రం డెస్టినేషన్ వెడ్డింగ్ వైపు మొగ్గుచూపింది.
వచ్చేనెల 9న జరగనున్న ఈ పెళ్లికి కేవలం మెగా కుటుంబ సభ్యులు, అటు చైతన్య కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారు. పెళ్లి తర్వాత హైదరాబాద్ లో రిసెప్షన్ ఉంటుందా ఉండదా అనే విషయంపై నాగబాబు నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.