స్పై విషయంలో నిఖిల్ కు, నిర్మాతకు మధ్య జరిగిన తకరారు సంగతి అందరికీ తెలిసిందే. ప్రమోషన్ కు టైమ్ చాలదు కాబట్టి సినిమాను వాయిదా వేయమన్నాడు నిఖిల్. ఆర్థికంగా నష్టపోతాను కాబట్టి పోస్ట్ పోన్ కుదరదన్నాడు నిర్మాత. ఫైనల్ గా నిర్మాత దారిలోకే నిఖిల్ రావాల్సి వచ్చింది. స్పై సినిమాకు హడావుడిగా ప్రచారం చేస్తున్నాడు.
ఈ ప్రచారంలోనే తన అప్ కమింగ్ మూవీస్ కు సంబంధించి క్లారిటీ ఇచ్చాడు నిఖిల్. స్పై నుంచి నేర్చుకున్న గుణపాఠంతో ముందుజాగ్రత్త చర్యలకు దిగుతున్నాడు. అదేంటంటే.. ఇకపై తన సినిమాలకు సంబంధించి టోటల్ షూటింగ్ పూర్తయ్యేంత వరకు రిలీజ్ డేట్ ప్రకటించకూడదు.
ఈ కండిషన్ పైనే ఇకపై సినిమాలు చేస్తాడట నిఖిల్. త్వరలోనే రామ్ చరణ్ నిర్మాతగా ది ఇండియా హౌజ్ అనే సినిమా చేయబోతున్నాడు నిఖిల్. చరణ్ ను కూడా ఈ విషయంపై రిక్వెస్ట్ చేశాడట. ఇక స్వయంభూ అనే మరో సినిమా కూడా ప్రకటించాడు. ఆ సినిమా నిర్మాతకు కూడా ఇదే విషయంపై విజ్ఞప్తి చేశాడట.
స్పై సినిమాకు సంబంధించి స్క్రీన్ ప్లేలో చేసిన మార్పులకు తగ్గట్టు చిన్న పార్ట్ షూటింగ్ చేద్దామని నిర్మాతను కోరాడు నిఖిల్. దీంతో పాటు పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్ చేయాలి కాబట్టి రిలీజ్ డేట్ ను మారుద్దామన్నాడు. కానీ నిఖిల్ అనుకున్నట్టు జరగలేదు. దీంతో తన అప్ కమింగ్ సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించబోతున్నాడు ఈ హీరో.