హీరో నిఖిల్ సినిమా థియేటర్లోకి వచ్చి చాలా కాలం అయింది. దాదాపు మూడు సినిమాలు పూర్తయి వున్నాయి. కానీ ఎప్పుడు థియేటర్లలోకి వస్తాయో తెలియదు. గీతా 2 సంస్థలో 18 పేజెస్ రెడీ అయి వుంది. పెద్దగా ఖర్చు పెట్టిన సినిమా కాదు కనుక ఓకె. భోగవిల్లిబాపినీడు లండన్ బ్యాక్ డ్రాప్ లో నిర్మించిన సినిమా పూర్తయి వుంది. బడ్జెట్ పరంగా అదీ సమస్య కాదు.
కానీ పీపుల్స్ మీడియా నిర్మించిన కార్తికేయ 2 మాత్రం కాస్త ఓవర్ బడ్జెట్ నే అయిందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును దర్శకుడు చందుమొండేటి 20 కోట్ల లో తీస్తా అని నిర్మాత ఆసియన్ సునీల్ దగ్గరకు తీసుకెళ్తే, అంత వేయబుల్ కాదని ఆయన నో అన్నారు. అంతా కలిపి 15 కోట్లతో తీస్తామని పీపుల్స్ మీడియా దగ్గరకు తీసుకెళ్లారు.
కానీ ఇప్పటికే ఈ సినిమాకు 25 కోట్ల వరకు ఖర్చయిందని తెలుస్తోంది. గ్రాఫిక్స్ వర్క్ లు పూర్తి కావడానికి ఇంకా మరో మూడు నెలలు పడుతుందని బోగట్టా.
విడుదల వేళకు టోటల్ ఖర్చు ఎంత అవుతుందో? విడుదల ఖర్చులు, పబ్లిసిటీ, అప్పటి వరకు వడ్డీలు కలిపి 30 కి చేరుతుందేమో? నాన్ థియేటర్ మీద 14 కోట్లు రికవరీ వచ్చింది. అంటే థియేటర్ మీద 16 కోట్ల వరకు రావాలి. అంత సాధ్యమా అన్నది విడుదల దగ్గరకు వచ్చాక కానీ తెలియదు.