నిర్మాత భార్య-ఛలో కోడి పందాలు

ఆడవాళ్లు అయితే ఏం..సరదాలు..సందళ్లు అక్కరలేదా..వై మెన్ ఓన్లీ హావ్ ప్లెజర్ అంటూ పబ్లిసిటీ స్లోగన్ వినపడలేదా? అందుకే కావచ్చు. ఓ పెద్ద నిర్మాత భార్య ఈ సంక్రాంతికి హ్యాపీగా ఆంధ్ర కు వెళ్లి కోడిపందాలు…

ఆడవాళ్లు అయితే ఏం..సరదాలు..సందళ్లు అక్కరలేదా..వై మెన్ ఓన్లీ హావ్ ప్లెజర్ అంటూ పబ్లిసిటీ స్లోగన్ వినపడలేదా? అందుకే కావచ్చు. ఓ పెద్ద నిర్మాత భార్య ఈ సంక్రాంతికి హ్యాపీగా ఆంధ్ర కు వెళ్లి కోడిపందాలు ఆడి, సరదా తీర్చుకువచ్చినట్లు తెలుస్తోంది. 

సినిమా రంగంలో నిర్మాతలకే కాదు, వాళ్ల భార్యలకు కూడా ఎవరి వ్యాపకాలు వారికి, ఎవరి సరదాలు వారికి, ఎవరి సర్కిల్ వారికి వుంటాయి.  కలిసి వెళ్తే కలిసి..లేదంటే తమ సర్కిల్ తో తమ హడావుడి తమది అన్నట్లు సాగిపోతాయి బడా జీవితాలు.

ఈ నిర్మాత కూడా తన పనులతో తాను బిజీగా వుంటారు. పైగా చేతిలో చాలా సినిమాలు వున్నాయి. ఆ పనులు వున్నాయి. ఆమె కు ఆంధ్రలో వ్యాపార వ్యవహారాలు వున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కొంత మంది స్నేహితురాళ్లతో కలిసి ఈసారి కోడి పందాలను ఎంజాయ్ చేసి వచ్చినట్లు తెలుస్తోంది.

నిర్మాతల భార్యలు తమ స్నేహితురాళ్లతో విదేశాలకు, షాపింగ్ కు వెళ్లడం కామన్. అందువల్ల అది వార్త కానే కాదు. కానీ కోడిపందాలకు వెళ్లడం కాస్త కొత్త. అందుకే ఇది వార్తయింది.