నిర్మాతగా మారుతున్న వంశీ హీరోయిన్

ఏ చెరువులో బతికే కప్ప ఆ చెరువులోనే బతుకుతుందని సామెత. సినిమా జనాల వ్యవహారం అలాగే వుంటుంది. డబ్బులు వున్నా, మరే వ్యాపారానికి దిగలేరు. సినిమా నిర్మాణం లేదా అంటే బట్టల కొట్టు కాదూ…

ఏ చెరువులో బతికే కప్ప ఆ చెరువులోనే బతుకుతుందని సామెత. సినిమా జనాల వ్యవహారం అలాగే వుంటుంది. డబ్బులు వున్నా, మరే వ్యాపారానికి దిగలేరు. సినిమా నిర్మాణం లేదా అంటే బట్టల కొట్టు కాదూ అంటే రెస్టారెంట్. ఎక్కవ మంది సినిమా నిర్మాణానికే మొగ్గు చూపిస్తారు. ఒకప్పటి కళ్యాణి కూడా ఇప్పుడు అదే పని చేస్తోంది. అవును వాళ్లు ఇద్దరూ ఇష్టపడ్డారు అన్న సినిమా గుర్తుకువస్తే కళ్యాణి కళ్ల ముందుకు వస్తుంది.

మలయాళంలో బోలెడు సినిమాలు చేసి, అక్కడి నుంచి తెలుగులోకి వచ్చి రవితేజ, జగపతిబాబు లాంటి వాళ్ల సరసన సినిమాలు చేసి, ఉన్నట్లుండి పెళ్లి చేసుకుని తెరవెనక్కు వెళ్లిపోయింది కళ్యాణి. ఇప్పుడు ఆమె నిర్మాతగా మారుతోంది. 

తన అసలు పేరు (కావేరి) స్క్రీన్ పేరు (కళ్యాణి) కలిపి కే2కే అనే బ్యానర్ స్టార్ట్ చేసి, చిన్న సినిమా ఒకటి ప్లాన్ చేస్తోంది.  సంపాదించిన డబ్బులు జాగ్రత్త చేసుకోకుండా చిన్న సినిమా ప్లాన్ చేయడమే తప్పు. అది చాలదన్నట్లు ఆమే డైరక్షన్ కూడా చేయబోతోంది. పైగా తమిళ, తెలుగు భాషల్లో నిర్మాణం. రియల్ స్టోరీ బేస్ చేసుకుని తయారు చేస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అంట.

పరిశ్రమ పరువు తీసేది కాదు, పరువు పెంచేది ఈ సినిమా