యూరోప్ లో కరోనా సెకెండ్ వేవ్ (రెండో దశ) మొదలైంది. పరిస్థితిని సమీక్షించిన స్పెయిన్ ప్రభుత్వం.. మరోసారి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇటలీ లాంటి దేశాల్లో కూడా రాత్రివేళల్లో కర్ఫ్యూ విధిస్తున్నారు.
పగటి పూట కూడా కొన్ని ఆంక్షలు విధిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇటలీలో ఇరుక్కుపోయింది ప్రభాస్ యూనిట్. రాధేశ్యామ్ షూటింగ్ కోసం మరోసారి ఇటలీకి వెళ్లిన యూనిట్ కు కరోనా సెగ తప్పలేదు.
చాలా ఆంక్షల మధ్య షూటింగ్ చేస్తున్నారు. దీంతో తమ షూట్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసుకొని ఇండియాకు వచ్చేయాలని ఫిక్స్ అయ్యారు. ప్రభాస్ పరిస్థితిని గమనించిన నితిన్, ఇప్పుడు పూర్తిగా వెనక్కి తగ్గాడు.
ప్రస్తుతం రంగ్ దే సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ మూవీ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో నడుస్తోంది. త్వరలోనే సాంగ్స్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్లాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కొన్ని రోజుల కిందట ప్రకటించారు కూడా. అయితే రాధేశ్యామ్ యూనిట్ కు ఎదురవుతున్న కష్టాలు చూసిన రంగ్ దే యూనిట్.. తమ ప్రయత్నాన్ని విరమించుకుంది.
ఇటలీ ప్లాన్ డ్రాప్ అవ్వడంతో.. సాంగ్ షూటింగ్ కోసం ఇప్పుడు ఆఘమేఘాల మీద ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక సాంగ్ ను ఇండియాలోనే పూర్తిచేయాలని, మరో పాటను సెట్ లో లాగించేయాలని నిర్ణయించారు.