నితిన్ ఆశలన్నీ ఆ సినిమా మీదే

హీరో నితిన్ నుంచి లేటెస్ట్ గా రాబోతున్న సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‌. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో రాబోతున్న ఈ సినిమా మీదే నితిన్ గట్టిగా ఆశలు పెట్టుకున్నాడు.  Advertisement ప్రస్తుతం మూడు…

హీరో నితిన్ నుంచి లేటెస్ట్ గా రాబోతున్న సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‌. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో రాబోతున్న ఈ సినిమా మీదే నితిన్ గట్టిగా ఆశలు పెట్టుకున్నాడు. 

ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు నితిన్. వెంకీ కుడుమల, వేణు శ్రీరామ్ లతో సినిమాలు రెండూ సెట్ మీద వున్నాయి. ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‌ విడుదలకు రెడీ అవుతోంది. వక్కంతం వంశీ దర్శకుడు. ఈ సినిమాలో నితిన్ ది ఓ డిఫరెంట్ క్యారెక్టర్. జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తాడు హీరో. ఇదో టిపికల్ మనస్తత్వం వున్న క్యారెక్టర్ అని తెలుస్తోంది.

సినిమాలో ఇటు ఫ్యామిలీ ఎమోషన్లు, అటు మాస్ ఎంటర్ టైన్ మెంట్ పక్కాగా మిక్స్ అయ్యేలా చూసారు. ఈసారి హిట్ కొట్టి తీరాలని సినిమాను చాలా సార్లు అటు మార్చుకున్నారు. ఎక్కడా కూడా బాలేదు లేదా డౌన్ అయింది అన్నది లేకుండా వుండడానికి అనేక సార్లు కథ మీద కసరత్తులు చేసారు. అలా చేసినపుడల్లా షూటింగ్ కు పాజ్ బటన్ నొక్కారు. మొత్తం మీద సినిమాను పూర్తి చేసుకున్నారు.

తరువాత సినిమాలు రెండింటి మీద నితిన్ కు భరోసా వుంది. ఎందుకంటే వెంకీ కుడుమల ప్రూవ్డ్ డైరక్టర్. వేణు శ్రీరామ్ కూడా మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అందువల్ల ఆ సినిమాల గురించి బెంగ లేదు. ఈ ఒక్క సినిమా పాస్ అయిపోతే నితిన్ లైన్ సెట్ అయినట్లే.