జేపీ.. మీరు మారిపోయారు సర్!

జయప్రకాష్ నారాయణ.. ఆ పేరు వింటే లోకసత్తా.. మేధావి వర్గం ఇలాంటివి గుర్తుకు వచ్చేవి. కూకట్ పల్లి నుంచి పోటీ చేసినపుడు కులముద్ర కూడా ఆయన మీద పడింది. ఆ తరువాత నుంచి యాక్టివ్…

జయప్రకాష్ నారాయణ.. ఆ పేరు వింటే లోకసత్తా.. మేధావి వర్గం ఇలాంటివి గుర్తుకు వచ్చేవి. కూకట్ పల్లి నుంచి పోటీ చేసినపుడు కులముద్ర కూడా ఆయన మీద పడింది. ఆ తరువాత నుంచి యాక్టివ్ పాలిటిక్స్ కు కాస్త దూరంగా జరిగారు. తన సోషల్ ట్రస్ట్ కార్యక్రలాపాలు నిర్వహించుకుంటూ, జనాల్లో అవేర్ నెస్ కోసం తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ వెళ్తున్నారు.

కానీ ఇటీవల ఆయన తన ధోరణి మార్చుకున్నట్లు కనిపిస్తోంది. పాలక పక్షాలకు కితాబు ఇస్తూ ముందుకు వెళ్తున్నట్లు అనిపిస్తోంది. అటు జగన్, ఇటు కేసీఆర్ బలంగా వున్నారని జేపీ నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు వెనుక మద్దతుగా నిలిచినా ప్రయోజనం ఏముంటుంది? అలా అని చంద్రబాబు అధికారంలోకి వచ్చినా చాలా సులువుగా జేపీ కిి అక్కడ ఎంట్రీ దొరుకుతుంది. అక్కడ సమస్య అవుతుందన్న భయం లేకుండా ఆయన వైల్డ్ కార్డ్ వుండనే వుంది.

బహుశా అందువల్లనే జగన్ పింఛను స్కీము ను ప్రశంసిస్తున్నారు. విద్యారంగం, వైద్యం రంగంలో చేస్తున్న కృషి భవిష్యత్ లో ఫలితాల ఇచ్చేలా వుందని అంటున్నారు. లేటెస్ట్ గా కేసీఆర్ పాలనను కూడా మెచ్చుకున్నారు. దళిత బంధు చాలా అద్భుతమైన స్కీము అంటున్నారు. పనిలో పనిగా కాంగ్రెస్ ను తూర్పార పడుతున్నారు. కాంగ్రెస్ అధికారం కోసం ఏమైనా చేస్తుందని, రాష్ట్రాలని అధోగతి పాలు చేస్తుంద‌ని అంటున్నారు.

అంటే కేసీఆర్ పాలనను మెచ్చుకుంటూ, కాంగ్రెస్ దూకుడుకు బ్రేకులు వేస్తూ, అదే సమయంలో సెటిలర్స్ ఓట్లకు గాలం వేసేలా జేపీ పెద్ద ప్లానే వేసినట్లు కనిపిస్తోంది. లేదా జేపీ ద్వారా భా.రా.స ఈ ప్లాన్ వేసినా వేసి వుండొచ్చు. 

కానీ మొత్తం మీద జేపీ తనకు అంటూ ఏదైనా ఇమేజ్ వుంటే దాన్ని పణంగా పెట్టినట్లే ఈ సీనియర్ ఓల్డ్ ఏజ్ లో. బహుశా ఇక ఈ పోరాటం.. ఆరాటం వల్ల ఒరిగేది ఏమీ లేదు.. గాలి ఎటు బలంగా వుంటే అటు తెరచాప ఎత్తాల్సిందే అనే నిర్ణయానికి వచ్చారేమో?