సిద్దార్థ్ రెడ్డిగా మారిన నితిన్

నితిన్ కొత్త సినిమా అప్ డేట్ వచ్చింది. మాచర్ల నియోజవర్గం సినిమాలో ఇతడు కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడనే విషయం చాలామందికి తెలిసిందే. ఇప్పుడా పాత్ర పేరును బయటపెట్టారు. సినిమాలో కలెక్టర్ ఎన్.సిద్దార్థ్ రెడ్డిగా కనిపించబోతున్నాడు…

నితిన్ కొత్త సినిమా అప్ డేట్ వచ్చింది. మాచర్ల నియోజవర్గం సినిమాలో ఇతడు కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడనే విషయం చాలామందికి తెలిసిందే. ఇప్పుడా పాత్ర పేరును బయటపెట్టారు. సినిమాలో కలెక్టర్ ఎన్.సిద్దార్థ్ రెడ్డిగా కనిపించబోతున్నాడు నితిన్. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ ను మార్చి 26 ఉదయం 10 గంటల 8 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు.

మాచర్ల నియోజకవర్గం అప్ డేట్ ను డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రజెంట్ చేశారు. ప్రభుత్వ జీవో కాపీ ఎలా ఉంటుందో అలాంటి ఫార్మాట్ తయారు చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్ గా ఎన్.సిద్దార్థ్ రెడ్డి తక్షణం విధుల్లోకి జాయిన్ అవుతారనే ఆదేశాలను ఇచ్చేలా ఆ జీవీ కాపీని తయారుచేశారు. పోస్టర్ లో జీవో కాపీపై రక్తపు మరకలు పడినట్టు చూపించి, సినిమాలో యాక్షన్ ఉంటుందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు మేకర్స్.

ఈ మధ్య టాలీవుడ్ లో కలెక్టర్ పాత్రలు వస్తున్నాయి. మొన్నటికిమొన్న రిపబ్లిక్ మూవీలో సాయితేజ్ కలెక్టర్ గా కనిపించాడు. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో రామ్ చరణ్ కూడా సివిల్ సర్వీస్ ఉద్యోగిగా కనిపించబోతున్నాడు. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గంలో నితిన్ కూడా జిల్లా కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఒకప్పుడు పోలీస్ పాత్రలు ట్రై చేసిన హీరోలంతా, ఇప్పుడిలా కలెక్టర్ రోల్స్ కు మొగ్గు చూపుతున్నట్టుంది.

ఇక సినిమా విషయానికొస్తే, మాచర్ల నియోజకవర్గంలో కృతి షెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్యాథరీన్ త్రెసా రెండో హీరోయిన్ గా నటిస్తోంది.

రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ అన్నీ ఆదిత్య మూవీస్ వద్ద ఉన్నాయి.