భీమ్లానాయక్ సినిమాతో దర్శకుడు సాగర్ పేరు గట్టిగా వినిపించింది. ఆ తరువాత సినిమా ఏంటీ అన్నది పాయింట్. మొత్తానికి మరో మాంచి ప్రాజెక్ట్ సెట్ అయినట్లు తెలుస్తోంది. హీరో నితిన్ కు రెండు కథలు చెప్పగా ఒకదాన్ని ఓకె చేసాడని తెలుస్తోంది. ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కథను నితిన్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
భీమ్లానాయక్ తో సాగర్ కు క్రెడిట్ రావాల్సిందే కానీ త్రివిక్రమ్ నీడలో వుండిపోవడం వల్ల రావాల్సినంత క్రెడిట్ రాలేదు. ఇప్పుడు ఈ సినిమాతో ప్రూవ్ చేసుకుంటే కెరీర్ సెటిల్ అయిపోతుంది. ప్రస్తుతం నితిన్ చేతిలో ఒక ప్రాజెక్ట్ వుంది. అది ఎలా వుంటుందో అన్నది క్లారిటీ లేదు. 2018లో అంటే దాదాపు అయిదేళ్ల క్రితం బన్నీ తో దారుణమైన డిజాస్టర్ అందించిన వక్కంతం వంశీ ప్రాజెక్టు అది.
అది వచ్చే లోగా చేసిన మాచర్ల నియోజకవర్గం సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు కానీ అవి నెరవేరలేదు. ఇలాంటి నేపథ్యంలో సరైన ప్రాజెక్టు కోసం చూస్తున్నాడు. అందులో పార్ట్ గానే సాగర్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
వక్కంతం వంశీ ప్రాజెక్టుకు టాగోర్ మధు నిర్మాత. సాగర్ ప్రాజెక్టు కు సాహు గారపాటి నిర్మాత.