హీరోయిన్లలో నయనతార రూటే సెపరేట్. ఎప్పుడూ ఓ మెట్టు పైనే. రెమ్యూనిరేషన్ పరంగా, నియమ నిబంధనల పరంగా. తమ సినిమాకు అవసరం, తప్పదు అనుకున్నవాళ్లంతా ఆమెను భరించాల్సిందే.
ఒకప్పుడు మూడు కోట్లు అని వినిపించింది రెమ్యూనిరేషన్. తరువాత నితిన్ అంథాదూన్ టైమ్ లో అయిదు కోట్లు అని వినిపించింది. అంత ఇవ్వలేక ఆ సినిమాకు తమన్నాతో ముందుకు వెళ్తారు.
ఇప్పుడు నయన్ కు పెళ్లయిపోయింది. అలా అని వెనకడుగు లేదు రెమ్యూనిరేషన్ విషయంలో. ఇటీవల తెలుగులో ఓ సీనియర్ హీరో పక్కన నటించేందుకు నయన్ ను అనుకున్నారట. ఆమె చెప్పిన రేటు చూసి షాకై వెనక్కు తగ్గారట. జస్ట్ ఏడు కోట్లు రెమ్యూనిరేషన్ కోట్ చేసిందట నయనతార. అంతే కాదు రోజుకు లక్ష వంతున తన టీమ్ ఖర్చులు భరించాలని చెప్పిందని తెలుస్తోంది. కనీసం యాభై వర్కింగ్ డేస్ వేసుకున్నా, యాభైలక్షలు అదనం అన్నమాట.
ఇవి కాక నయన్ కు, ఆమె స్టాఫ్ కు చెన్నయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చినపుడల్లా ఫ్లయిట్ టికెట్ లు, హోటల్ రూమ్ లు, ఫుడ్ బిల్లులు అదనం. అంతా కలిపి దాదాపు పది కోట్ల మేరకు డేకేస్తుందని అంచనా. ఇలా అయితే తెలుగులో నయన్ మరోసారి కనిపించడం కష్టమే కావచ్చు.