నితిన్ వాలంటైన్స్ డే గిఫ్ట్

ప్రేమికుల కోసం ప్రేమికుల రోజున తన ప్రేమపాటను విడుదల చేశాడు నితిన్. చాలామంది ఎదరుచూస్తున్న భీష్మ సినిమా నుంచి సింగిల్స్ ఏంథెమ్ కొద్దిసేపటి కిందట విడుదలైంది. ఆడియో ఇప్పటికే విడుదలకాగా.. ఇప్పుడు వీడియోతో కూడా…

ప్రేమికుల కోసం ప్రేమికుల రోజున తన ప్రేమపాటను విడుదల చేశాడు నితిన్. చాలామంది ఎదరుచూస్తున్న భీష్మ సినిమా నుంచి సింగిల్స్ ఏంథెమ్ కొద్దిసేపటి కిందట విడుదలైంది. ఆడియో ఇప్పటికే విడుదలకాగా.. ఇప్పుడు వీడియోతో కూడా ఈ పాట ఆకట్టుకుంది.

రకరకాల గెటప్స్ లో నితిన్ ఈ సాంగ్ లో కనిపిస్తున్నాడు. ప్రేమ కోసం పరితపించే అతడి పాత్రను ఈ పాటలో ఎలివేట్ చేశారు. వయసొచ్చింది కానీ ఇంకా సింగిల్ గానే ఉన్నానని, తనకు కూడా ఓ గర్ల్ ఫ్రెండ్ కావాలంటూ నితిన్ సాంగేసుకున్నాడు. ఈ క్రమంలో నితిన్ గెటప్స్ బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

పాత తరానికి చెందిన చిరంజీవి లుక్, శోభన్ బాబు లుక్ తో పాటు ఖుషి సినిమాలో పాపులర్ అయిన టెంపుల్ సీన్ ను కూడా ఈ సాంగ్ లో ఫన్నీగా చూపించారు. అటుఇటుగా 2 నిమిషాల నిడివి ఉన్న ఈ పాటలో నితిన్ గెటప్స్, స్టెప్స్ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. మహతి స్వరసాగర్ కంపోజ్ చేసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు.

అయితే చిన్న నిరాశ ఏంటంటే.. ప్రేమికుల రోజున నితిన్-రష్మిక సాంగ్ ను రిలీజ్ చేస్తారని అంతా భావించారు. సింగిల్స్ ఏంథెమ్ వస్తోందని ముందే చెప్పినా అందులో రష్మిక కూడా ఉంటుందని చాలామంది ఊహించారు. కానీ అలా జరగలేదు. నితిన్-రష్మిక కాంబోలో మరో వీడియో, మరో రోజున రాబోతోంది. ఫిబ్రవరి 21న థియేటర్లలోకి వస్తున్నాడు భీష్మ.