Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇక్కడ ఫ్లాప్.. అక్కడ హిట్.. మొత్తానికి 'చెక్' పెట్టింది

ఇక్కడ ఫ్లాప్.. అక్కడ హిట్.. మొత్తానికి 'చెక్' పెట్టింది

సినిమా ఫ్లాప్ అయినా దాన్ని సమర్థించుకోవడానికి ఓ రీజన్ కావాలి. తమ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుందని కొందరు చెబుతారు. బి, సి సెంటర్లలో బాగా ఆడిందని మరికొందరు చెబుతారు. 

డబ్బులు రాకపోయినా తృప్తి ఉందని ఇంకొందరు చెబుతుంటారు. అయితే చెక్ సినిమాకు ఇలా చెప్పడానికేం లేదు. నితిన్ నటించిన ఈ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయింది. ఇన్నాళ్లకు ఈ సినిమాకు చెప్పుకోడానికి ఓ మంచి రీజన్ దొరికింది.

జెమినీ టీవీలో ప్రసారం చేసిన చెక్ సినిమాకు మంచి రేటింగ్ వచ్చింది. తొలిసారి టెలికాస్ట్ చేసిన ఈ సినిమాకు ఏకంగా 8.53 టీఆర్పీ రావడం విశేషం. ఇది మంచి రేటింగ్. ఇంకా చెప్పాలంటే నితిన్ నటించిన రంగ్ దే, భీష్మ సినిమాల కంటే ఇది బెటర్ టీఆర్పీ.

నితిన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన భీష్మ సినిమాకు టీవీల్లో 6.65 టీఆర్పీ వస్తే.. రంగ్ దే సినిమాకు 7.22 టీఆర్పీ వచ్చింది. ఇప్పుడీ రెండు సినిమాల్ని క్రాస్ చేస్తూ చెక్ సినిమాకు రేటింగ్ వచ్చింది. అలా ఈ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయినా, బుల్లితెరపై హిట్ అనిపించుకుంది.

చంద్రశేఖర్ యేలేటి డైరక్ట్ చేసిన చెక్ సినిమాలో ఉరిశిక్ష పడ్డ ఖైదీగా నటించాడు నితిన్. క్లైమాక్స్ లో సరిగ్గా ఉరి తీయడానికి ముందు జైలు నుంచి తప్పించుకుంటాడు. సీక్వెల్ కూడా ఉందనే విధంగా క్లయిమాక్స్ ను ముగించారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?