టార్గెట్ చేసి మరీ ఠారెత్తిస్తున్న ఏసీబీ?

ఏసీబీ అంటేనే వణుకు పుడుతుంది. అవినీతి నిరోధక శాఖ కొరడా ఝళిపించింది అంటే చాలు అక్రమార్కుల గుండెల్లో దడ మొదలవుతుంది. నూటొకటి కొడుతుంది. అలాంటి ఏసీబీ విశాఖలోని కొన్ని కీలకమైన  తాశీల్దార్ ఆఫీసులను టార్గెట్…

ఏసీబీ అంటేనే వణుకు పుడుతుంది. అవినీతి నిరోధక శాఖ కొరడా ఝళిపించింది అంటే చాలు అక్రమార్కుల గుండెల్లో దడ మొదలవుతుంది. నూటొకటి కొడుతుంది. అలాంటి ఏసీబీ విశాఖలోని కొన్ని కీలకమైన  తాశీల్దార్ ఆఫీసులను టార్గెట్ చేసింది.

ఒకటి కాదు రెండు కాదు సిటీ పరిధిలోని అయిదు ఆఫీసుల మీద ఏసీబీ కన్నేసింది. వరసగా మూడు రోజులుగా అక్కడ పెద్దేత్తున సోదాలు జరుగుతున్నాయి. విశాఖ సిటీలోని సీతమ్మధార, పద్మనాభం, పెందుర్తి, సబ్బవరం, ఆనందపురం తాశీల్దార్ ఆఫీసుల్లో ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న లావాదేవేల మీద ఏసీబీ గట్టి నిఘా పెట్టింది. మొత్తం వ్యవహారాలను కూపీ లాగుతోంది.

ఈ మధ్యకాలంలో విశాఖలో భారీగా పెరిగిన భూముల ధరలు, దాంతో పాటు ఇతర రెవిన్యూ వ్యవహారాల నేపధ్యంలో ఏసీబీ మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. గతంలో వీటిలో చాలా చోట్ల విలువైన భూములకు సంబంధించిన  పత్రాలు తారు మారు అయ్యాయి. అంతే కాదు భూ కబ్జాదారులు కూడా కొందరురెవిన్యూ అధికారులను అడ్డం పెట్టుకుని కధను సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నారు.

దాంతో ఏసీబీకి అవినీతి మీద ఆరొపణలు వెల్లువలా రావడంతో దుమ్ము దులిపే పనిలో పడింది అంటున్నారు. ఇక ప్రభుత్వ పధకాలు సంబంధించి లబ్దిదారులకు అవసరమైన పత్రాల జారీలో కూడా లంచగొండితనం బాగా ఉందని వస్తున్న ఆరోపణల నేపధ్యంలో ఏసీబీ తమ ప్రతాపం చూపిస్తోంది. 

మొత్తం మీద ఏసీబీ వరస సోదాలు మాత్రం విశాఖ సిటీలో సంచలనం రేపుతున్నాయి. మరి అనూహ్యమైన విషయాలు బయటకు వస్తాయా అంటే వేచి చూడాలి.