అంతా నా ఇష్టం…అని వ్యవహరిస్తున్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ గురించి మాత్రమే ఇంత కాలం తెలుసు. కానీ వర్మ స్థాయిలో కాకపోయినా ఓ మోస్తారు లెక్క చేయని స్వభావం హీరోయిన్ నిత్యా మీనన్‌ది. మలయాళీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు…మాతృభాషతో పాటు తమిళం, హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బహుభాషా నటిగా గుర్తింపు పొందారు.
లాక్‌డౌన్ కారణంగా సినీ సెలబ్రిటీలంతా ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిత్యా మీనన్ కాస్తా బరువు పెరిగారు. దీంతో అభిమానులు ఆమెపై విమర్శలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై ఆమె స్పందిస్తూ…”నా శరీరం నా ఇష్టం. నేను ఎలా ఉంటే మీకెందుకు” అని గడుసుగా జవాబిచ్చారు. ఇటీవల సైకో చిత్రంలో నిత్య విషయం తెలిసిందే.
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో తెరకెక్కనున్న “ది ఐరన్ లేడీ” చిత్రంలో టైటిల్ పాత్రలో నిత్యా మీనన్ నటించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇంత వరకూ ఆ సినిమా ప్రారంభం కాలేదు. ఇదిలా చర్చ సాగుతుండగానే నిత్యామీనన్ బ్రీత్ ఇన్ టు ద షాడోస్ అనే హిందీ చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలై కెవ్వు కేక అని హల్‌చల్ చేస్తోంది.
ఈ సినిమాలో నిత్యామీనన్ లెస్బియన్‌గా నటించి విమర్శలు, ప్రశంసలు అందుకుంటోంది. క్యారెక్టర్ స్వభావ రీత్యా మరో యువతితో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించిన మీనన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు అసహజమైన పాత్రలో నటించడానికి నిత్యా మీనన్ ఎలా అంగీకరించారనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. కానీ వీటిని ఆమె ఏ మాత్రం ఖాతరు చేయలేదు.
మరో వైపు బ్రీత్ ఇన్ టు ద షాడోస్ చిత్రాన్ని ప్రైమ్ వీడియోలో చూస్తూ యూత్ తెగ ఎంజాయ్ చేస్తోంది. వివాదాలను కోరి కోరి తెచ్చుకునే నిత్యా మీనన్ వాటిని ఎదుర్కోవడంలోనూ చొరవ చూపుతున్నారు. అందుకే అందుకు తగ్గట్టు ఆమెకు ప్రచారం లభిస్తోంది.