రానురాను మెయిన్ హీరోయిన్ నుంచి కీలక పాత్రల హీరోయిన్ గా మారింది నివేత థామస్. జెంటిల్ మేన్, నిన్నుకోరి సినిమాల్లో ఈ ముద్దుగుమ్మను చూసినప్పుడే మరో సౌందర్య అవుతుందని అంతా అనుకున్నారు. కానీ నివేత థామస్ మాత్రం అలా ఆలోచించలేదు. హీరోయిన్ రోల్స్ కంటే తన పాత్రలకే ప్రాధాన్యం ఇచ్చింది. అది సెకెండ్ హీరోయిన్ రోల్ అయినా ఫర్వాలేదని ఫిక్స్ అయింది.
నివేత తీసుకున్న నిర్ణయం చాలాసార్లు నిజమైంది కూడా. ఉదాహరణకు దర్బార్ సినిమానే తీసుకుందాం. అందులో నయనతార హీరోయిన్. కానీ పేరు మాత్రం నివేత థామస్ కు వచ్చింది. కల్యాణ్ రామ్ నటించిన 118 సినిమా కూడా ఇంతే. అందులో షాలినీ పాండే హీరోయిన్. కానీ పేరు మాత్రం నివేత థామస్ కు వచ్చింది.
రిలీజ్ కు రెడీ అయిన V సినిమా, ప్రస్తుతం సెట్స్ పై ఉన్న వకీల్ సాబ్ సినిమాల్లో కూడా నివేత థామస్ ది ఇలాంటి పాత్రలే. అలా తన పాత్రల్ని సెలక్ట్ చేసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఇదే ఊపులో నివేత వద్దకు మరో 2 ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తోంది. వాటిలో ఒకటి పుష్ప. బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు నివేత థామస్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇందులో మెయిన్ హీరోయిన్ రష్మిక అయినప్పటికీ, నివేత పాత్రకు కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుందట.
ఇంతకుముందే చెప్పుకున్నట్టు పాత్ర బాగుంటే చేయడానికి నివేతకు ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. అన్నీ అనుకున్నట్టు జరిగితే పుష్పలో ఆమె ఎంట్రీ గ్యారెంటీ అంటున్నారు. ఈ మూవీతో పాటు సుధీర్ వర్మ హ్యాండిల్ చేయబోతున్న ఓ రీమేక్ సబ్జెక్ట్ లో కూడా ఓ పాత్ర కోసం నివేతను అనుకుంటున్నారు. ఇలా కీలక పాత్రల హీరోయిన్ గా మారిపోయింది నివేత థామస్.