వారియర్ సినిమా మీద గట్టి నమ్మకం పెట్టుకున్నాడు హీరో రామ్. తొలిసారి తన సినిమా ఉత్తరాంధ్ర హక్కులు కొనేసి, అన్నపూర్ణ ద్వారా పంపిణీ చేయిస్తున్నాడు.
లింగుస్వామి డైరక్షన్ లో తయారవుతున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా మీద ఇండస్ట్రీలో కూడా ఓ పాజిటివ్ బజ్ వుంది. ఈ సినిమా ఆంధ్ర హక్కులను 17 కోట్ల రేషియోలో విక్రయిస్తే, వైజాగ్ ఏరియాను 4.32 కోట్లకు రామ్ నే తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు నైజాం కూడా రామ్ నే తీసుకున్నట్లు తెలుస్తోంది. నైజాం హక్కులను 13 కోట్ల మేరకు కోట్ చేసారు. బేరాలు సాగుతున్న టైమ్ లో రామ్, స్రవంతి రవికిషోర్ కలిసి తామే తీసుకున్నట్లు తెలుస్తోంది.
పదమూడు కోట్లకు తీసుకున్నారా? లేదా ఎక్కువ తక్కువలు వున్నాయా అన్నది తెలియదు కానీ, సినిమాను మాత్రం దిల్ రాజు దగ్గర డిస్ట్రిబ్యూషన్ కు వుంచారు.
తెలుగు సినిమాలకు కీలకమైన రెండు ఏరియాలు, వైజాగ్, నైజాం రెండూ రామ్ చేతిలోనే వున్నాయన్న మాట. ఇప్పటికే ఈ సినిమాలో మూడు పాటలు బాగా రీచ్ అయ్యాయి. ట్రయిలర్ బాగా టాక్ తెచ్చుకుంది.
దాదాపు మూడు, నాలుగు వారాలుగా సరైన సినిమా లేక థియేటర్ లు ఎదురు చూస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో వస్తోంది చిట్టూరి శ్రీను నిర్మించిన వారియర్.