నైజాంలో కేజిఎఫ్ 2 ధర్డ్ ప్లేస్

ఓ డబ్బింగ్ సినిమా తెలుగునాట కీలకమైన నైజాం ఏరియాలో దుమ్ము దులిపేసింది. సినిమా పేరు తప్ప మరే క్రేజ్ లేని సినిమా. జ‌నాలకు పరిచయం పెద్దగా లేని స్టార్ కాస్ట్, టెక్నికల్ కాస్ట్. కానీ…

ఓ డబ్బింగ్ సినిమా తెలుగునాట కీలకమైన నైజాం ఏరియాలో దుమ్ము దులిపేసింది. సినిమా పేరు తప్ప మరే క్రేజ్ లేని సినిమా. జ‌నాలకు పరిచయం పెద్దగా లేని స్టార్ కాస్ట్, టెక్నికల్ కాస్ట్. కానీ నైజాంలో మహా మహా సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్లను దాటేసింది. నైజాంలో ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 సినిమాల కలెక్షన్లు మినహా మిగిలిన అన్నింటినీ దాటేసినట్లు తెలుస్తోంది.

గమ్మత్తేమిటంటే మరే స్ట్రయిట్ భారీ సినిమా విడుదలయినా రోజు రోజూ కలెక్షన్ల మీద కలెక్షన్ల ఫిగర్లు విడుదల చేసే డిస్ట్రిబ్యూషన్ వర్గాలు కేజీఎఫ్ 2 విషయంలో మాత్రం మౌనంగా వున్నాయి. విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఈ ఆదివారంతో కలిపి కేజీఎఫ్ 2 సినిమా 42 కోట్లకుపైగా షేర్ వసూల చేసినట్లు తెలుస్తోంది.

అంటే రంగస్థలం, సాహో, భీమ్లా నాయక్, సరిలేరు నీకెవ్వరు, పుష్ప, అల వైకుంఠపురములో ఇలా చాలా అంటే చాలా సినిమాలను దాటేసినట్లు. ఇప్పటి వరకు నాన్ బాహుబలి రికార్డు అల వైకుంఠపురములో సినిమా పేరిట వుంది. 42 కోట్ల మేరకు ఆ సినిమా నైజాంలో వసూలు చేసిందని నిర్మాణ వర్గాల బోగట్టా. 

ఇప్పుడు కేజీఎప్ 2 దాన్ని దాటేసింది. కానీ లెక్కలు బయటకు చెబితే తెలుగు హీరో బన్నీ రికార్డు పోయినట్లు అవుతుంది. అందుకే కేజీఎఫ్ 2 డిస్ట్రిబ్యూషన్ వర్గాలు మౌనంగా వున్నట్లు తెలుస్తోంది.