నైజాం మార్కెట్ ను కేవలం ఇద్దరు బయ్యర్లు ఆసియన్ సునీల్-దిల్ రాజు శాసిస్తుండడంతో, చిరకాలంగా ఇక్కడ కొనుగోళ్లు నిలిచిపోయాయి. అన్నీ రీలీజ్ లే. ఒకవేళ కొన్నా కూడా వాళ్లు కోట్ చేసే రీజనబుల్ రేటుకే. గతంలో చాలా మంది బయ్యర్లు వుండేవారు కానీ రాను రాను తగ్గిపోయారు. ఆ మధ్య వరంగల్ శ్రీను ఎంటర్ అయ్యారు. కొన్ని కొన్నారు. కొంత లాభాలు చేసుకన్నారు. కొంత నష్టాలు మూటకట్టుకున్నారు. తరువాత ఆయన మళ్లీ వెనక్కు తగ్గిపోయారు అనుకున్నారు.
కానీ ఇప్పుడు మళ్లీ కరోనా టైమ్ లో కూడా వరంగల్ శ్రీను కొనుగోళ్లు జరిపేందుకు దూకుడుగా ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. రవితేజ క్రాక్, రానా విరాటపర్వం, గోపీచంద్ సీటీమార్, శర్వానంద్ శ్రీకారం సినిమాలను నైజాం ఏరియాకు బేరం చెసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రేట్లు, ఫైనల్ లాంటి వ్యవహారాలు మాత్రం తరువాత జరుగుతాయని బోగట్టా.
కరోనా నేపథ్యంలో పరిస్థితులు ఎలా వుంటాయో తెలియక దిల్ రాజు సైలంట్ అయ్యారు. సునీల్ వేచి చూసే ధోరణిలో వున్నారు. ఇలాంటి టైమ్ లో వరంగల్ శ్రీను దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. వీలయినంత త్వరగా థియేటర్లు ఓపెన్ అయితే ఈ దూకుడుకు ప్రయోజనం వుంటుంది. లేదూ అంటే అనవసరంగా అడ్వాన్స్ లకు వడ్డీలు కట్టుకోవాలి.