సిల్వర్ స్క్రీన్ పై ఆకట్టుకున్న అర్జున్ సురవరం సినిమా స్మాల్ స్క్రీన్ పై మాత్రం టోటల్ ఫెయిల్ అయింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగులో ప్రసారమైన ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రేటింగ్ రాలేదు. కేవలం 3.80 (ఏపీ+తెలంగాణ టోటల్) టీఆర్పీతో అర్జున్ అడ్జెస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఈ సినిమాకు కనీసం 10 టీఆర్పీ వస్తుందని అంతా ఆశించారు. కానీ ఎక్స్ పెక్ట్ చేసిన టీఆర్పీలో సగం కూడా రాలేదు.
అర్జున్ సురవరం సినిమా కంటే ఆల్రెడీ టెలికాస్ట్ అయిన మహర్షి, వినయ విధేయ రామ సినిమాలకు ఈ వారం మంచి టీఆర్పీ వచ్చింది. చివరికి నాగశౌర్య నటించిన అశ్వద్థామకు కూడా మంచి నంబర్స్ వచ్చాయి కానీ అర్జున్ సురవరం మాత్రం టాప్-5 లిస్ట్ లో నిలబడలేకపోయింది.
అర్జున్ సురవరంతో పాటు ఈసారి ఫ్రెష్ గా ఎన్జీకే, ఖైదీ లాంటి సినిమాలు టెలికాస్ట్ అయ్యాయి. సూర్య నటించిన ఎన్జీకే ఎట్టకేలకు స్టార్ మా ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయింది. అటు కార్తి నటించిన ఖైదీ సినిమా కూడా ఫస్ట్ టైమ్ స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైంది. అన్నదమ్ముల సినిమాలు రెండూ బుల్లితెరపై ఫ్లాప్ అయ్యాయి. కనీసం మూవీస్ రేటింగ్ లిస్ట్ లో టాప్-10లో కూడా వీటికి చోటు దక్కలేదు. విడుదలైన చాలా రోజులకు టెలికాస్ట్ అవ్వడంతో వీటిపై టీవీ ప్రేక్షకులకు క్రేజ్ తగ్గింది. పైగా ఓటీటీలో వీటిని ఇప్పటికే చాలామంది చూసేసి ఉన్నారు.