సెంట్ జాగా అయినా ఇచ్చావా బాబూ?

ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్ని చెప్పుకుంటారు.  భారీ ఎత్తున ఇళ్ళ స్థలాలు పేదలకు పంపిణీ అంటే మళ్ళీ ఆయనే గుర్తుకువస్తాడు. ఇక జగన్ సైతం అదే బాటలో నడుస్తూ ఏకంగా ముప్పయి లక్షల మంది పేదలకు…

ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్ని చెప్పుకుంటారు.  భారీ ఎత్తున ఇళ్ళ స్థలాలు పేదలకు పంపిణీ అంటే మళ్ళీ ఆయనే గుర్తుకువస్తాడు. ఇక జగన్ సైతం అదే బాటలో నడుస్తూ ఏకంగా ముప్పయి లక్షల మంది పేదలకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయబోతున్నారు.

దీని మీదనే సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ సంక్షేమం అంటే నాడూ నేడూ వైఎస్ కుటుంబమే జనాలకు కనిపిస్తోందని అన్నారు. పేదలకు ఏం చేయాలన్నా ఒకటికి రెండు అడుగులు ముందుకు వేసే కుటుంబం వారిదని అన్నారు.

చంద్రబాబు ముమ్మారు సీఎంగా ఉన్నారు కానీ పేదలకు సెంట్ జాగా ఇచ్చిన చరిత్ర ఉందా అంటూ ధర్మాన నిగ్గదీశారు. ఎంతసేపూ జన్మభూమి కమిటీలు పేరు చెప్పి గ్రామాల్లో పచ్చ పార్టీ వారు దందా చేశారు తప్ప పేదలకు బాబు పాలనలో ఎటువంటి న్యాయం జరగలేదని ధర్మాన అంటున్నారు.

పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలు అమలు చేయడమే కాదు, కరోనా టైంలో ఆరు సార్లు ఉచితంగా రేషన్ ఇచ్చిన ఘనత కూడా జగన్ దేనని ఆయన అన్నారు. మొత్తానికి బాబు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అని చెప్పుకోవడమే తప్ప వెనక్కి తిరిగి చూస్తుంటే ఏమీ మిగలలేదని  ధర్మాన చాలా ధర్మంగా చెప్పేశారుగా. 

ఉషారాణికి అండగా మంత్రి అనిల్

అల్లు అర్జున్ మాయ చేసేస్తాడు