భారీ ప్రణాళిక అన్నారు.. ‘ఫ్యాక్టరీ’లో ఏం జరుగుతోంది?

కొన్ని రోజుల కిందటి మాట. పవన్ కల్యాణ్ కు చెందిన పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ తో తాము భాగస్వామ్యం అయినట్టు పీపుల్ మీడియా సంస్థ ఘనంగా ప్రకటించింది.  Advertisement ఒప్పందంలో భాగంగా…

కొన్ని రోజుల కిందటి మాట. పవన్ కల్యాణ్ కు చెందిన పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ తో తాము భాగస్వామ్యం అయినట్టు పీపుల్ మీడియా సంస్థ ఘనంగా ప్రకటించింది. 

ఒప్పందంలో భాగంగా ఈ రెండు బ్యానర్లు కలిసి 6 చిన్న సినిమాలు, మరో 6 మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు, ఇంకో 3 భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తాయని.. ఈ 15 సినిమాల్లో దాదాపు 10 సినిమాలతో కొత్త టాలెంట్ ను పరిచయం చేస్తామని కూడా ప్రకటించారు.

ఈ ప్రకటన వచ్చి ఇవాళ్టికి సరిగ్గా ఏడాది పూర్తయింది. కానీ ఇప్పటివరకు ఈ జాయింట్ వెంచర్ పై క్లారిటీ రాలేదు. ఎలాంటి ప్రణాళిక వెల్లడించలేదు. ఈ గ్యాప్ లో తన సినిమాలు తాను చేసుకుంటున్నారు పవన్. అటు పీపుల్ మీడియా నిర్మాతలు కూడా తమ సినిమాలేవో తాము ప్లాన్ చేసుకుంటున్నారు.

ఈ ఏడాదిలో జరిగిన పరిణామం ఏదైనా ఉందంటే అది వినోదాయశితం రీమేక్ మాత్రమే. పవన్ తో ఈ రీమేక్ ప్లాన్ చేస్తోంది పీపుల్ మీడియా. పవన్ కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంకా అధికారిక ప్రకటన రాని ఈ సినిమాతో పవన్ కల్యాణ్, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలుగా చేతులు కలిపే అవకాశం ఉంది. మధ్యలో జీ స్టూడియోస్ కూడా వచ్చి చేరింది.

ఈ రీమేక్ సంగతి పక్కనపెడితే.. మిగతా సినిమాలపై, ఈ బ్యానర్ల భాగస్వామ్యంపై క్లారిటీ ఇస్తే బాగుంటుంది. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా ప్రపోజల్ చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉంది. 

పీపుల్ మీడియా బ్యానర్ భాగస్వామిగా మారడంతో.. పవన్ బ్యానర్ పై చరణ్ సినిమా కార్యరూపం దాల్చే అవకాశం ఉందంటూ గతంలో మెగాభిమానులు ఆశపడ్డారు. దానిపై కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు.