తనకు అస్సలు గ్యాప్ లేదంటున్న హీరోయిన్

హీరోయిన్లంతా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. శ్రీలీల లాంటి హీరోయిన్ చేతిలో ఏకంగా అరడజను సినిమాలున్నాయి. చాన్నాళ్ల కిందటే ఇండస్ట్రీకొచ్చిన అనుపమ పరమేశ్వరన్ అవకాశాల వేటలో వెనకబడిందనే ప్రచారం ఉండనే ఉంది. దీన్ని ఆ హీరోయిన్…

హీరోయిన్లంతా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. శ్రీలీల లాంటి హీరోయిన్ చేతిలో ఏకంగా అరడజను సినిమాలున్నాయి. చాన్నాళ్ల కిందటే ఇండస్ట్రీకొచ్చిన అనుపమ పరమేశ్వరన్ అవకాశాల వేటలో వెనకబడిందనే ప్రచారం ఉండనే ఉంది. దీన్ని ఆ హీరోయిన్ ఖండిస్తోంది.

“నా కెరీర్ లో అస్సలు గ్యాప్ లేదు. రోజూ షూటింగ్ ఉంటోంది. 365 రోజులు పని చేస్తూనే ఉన్నాను. తెలుగు-తమిళ్-మలయాళ భాషల్లో ప్రస్తుతం నేను 9 సినిమాలు చేస్తున్నాను. కాకపోతే నేను చేస్తున్న సినిమాలేంటనేది ఇప్పుడు చెప్పలేను. త్వరలోనే నేను నటిస్తున్న ఈగిల్ సినిమా రిలీజ్ అవుతుంది.”

ఇలా 9 సినిమాలు చేస్తున్నానని, కానీ వాటి వివరాలు మాత్రం చెప్పనంటోంది అనుపమ. తెలుగు వరకు చూసుకుంటే, ఆమె లాస్ట్ రిలీజ్ బట్టర్ ఫ్లై. అలా అనుపమ పరమేశ్వరన్ నుంచి సినిమా వచ్చి చాలా నెలలు అవుతోంది.

త్వరలోనే తన నుంచి టిల్లూ స్క్వేర్, ఈగిల్ సినిమాలు రాబోతున్నాయని తెలిపింది అనుపమ. వీటిలో టిల్లూ స్క్వేర్ లో తన పాత్ర ఏంటనేది అస్సలు చెప్పనంటోంది. ఈ సినిమాలు కాకుండా మలయాళం, తమిళ్ లో కూడా నటిస్తున్నానని అంటోంది.

తెలుగులో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నప్పటికీ, రాజమౌళి దర్శకత్వంలో నటించాలనే కోరిక మాత్రం అలానే ఉండిపోయిందంటోంది ఈ బ్యూటీ, రాజమౌళి నుంచి పిలుపొస్తే, పరుగెత్తుకుంటూ వెళ్లిపోతానని చెబుతోంది.