ఉన్నట్లుండి ఈ సాయంత్రం ఒక వార్త గుప్పుమంది. తెలుగుదేశం పార్టీ నుంచి హీరో ఎన్టీఆర్ కు సిఎమ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందింది అన్నది ఆ వార్త. నేషనల్ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు, ఫ్యాన్స్ హ్యాండిల్స్ నుంచి డిజిటల్ మీడియా హ్యాండిల్స్ వరకు దీన్న కూడై కూసాయి.
కానీ మళ్లీ మరో భోగట్టా. ఈసారి విశ్వసనీయ వర్గాల నుంచి, అలాంటి ఆహ్వానం ఏమీ అందలేదు అంటూ. ఎన్టీఆర్ ప్రస్తుతం గోవాలో షూటింగ్ లో వున్నారు. ఆహ్వానం అందలేదనే అనుకోవాలి. ఎందుకంటే అందుకుంటే ఎన్టీఆర్ ఈ అవకాశాన్ని వాడుకుని వుండేవారు.
గత కొంత కాలంగా పార్టీకి, రాజకీయాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ ను, భువనేశ్వరి మీద విమర్శలను ఖండించలేదనే విమర్శ వుంది. ఇటీవలే ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్టీఆర్ మంచి ట్వీట్ వేయడంతో, ఆ విమర్శలను చెరిపేసే ప్రయత్నం జరిగింది.
ఇప్పుడు కనుక ఆహ్వానం అందితే, ఎన్టీఆర్ తప్పకుండా హాజరై వుండేవారు. అటు ఫ్యాన్స్ ఇటు పార్టీ వర్గాలను ఆకట్టుకోవడమే కాకుండా, ఫుల్ పాజిటివ్ మార్కులను సంపాదించేవారు. అలాంటి అవకాశం అయితే వదులుకునేవారు కాదు. మరి ఏ ఇన్విటేషన్ రాలేదని కూడా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి అంటే రాలేదనే అనుకోవాలి.
అటు ఎన్టీఆర్ వెళ్లడం లేదు, ఇటు ఇన్విటేషన్ రాలేదు అనే రెండు సమాచారాలను కలిపి లెక్క పెడితే నిజంగానే ఆహ్వానం అందలేదనే అనుకోవాలి.