మంచి ఓపెనింగ్ పడినా ఇచ్చిన అడ్వాన్స్ ల మేరకు కలెక్షన్లు రాలేదు విష్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు దగ్గర దగ్గర 10 కోట్ల మేరకు ఆ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ చేసారు. దగ్గర దగ్గర ఎనిమిది కోట్ల షేర్ వసూలు చేసింది. దాని తరువాత విష్వక్ చేస్తున్న సినిమా మెకానిక్ రాఖీ. ఈ సినిమా థియేటర్ రైట్స్ సింగిల్ పాయింట్ దగ్గర విక్రయించేసారు నిర్మాత రామ్ తాళ్లూరి.
ఈ సినిమా ఇండియావైడ్ థియేటర్ రైట్స్ ను 8 కోట్లకు విక్రయించేసారు. రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు కలిపి 8 కోట్లకు ఆసియన్ సురేష్ సంస్థ తీసుకుంది. ఎనిమిది కోట్లకు ఎంజి లెక్కన తీసుకున్నారు.
ఇది మంచి డీల్ ఇటు నిర్మాతకు అటు బయ్యర్ కు. ఎలా లేదన్నా ఆంధ్ర మూడు నుంచి నాలుగు కోట్లకు వెళ్తుంది. సీడెడ్ కోటి నుంచి కోటిన్నరకు. కర్ణాటక ఓ యాభై లక్షలు. అంటే ఆరు కోట్లకు పైగా అక్కడే వస్తుంది. ఆసియన్ సురేష్ సంస్థకు నైజాం ఏరియా కోటి రెండు కోట్లకు వచ్చినట్లు. మంచి డీల్ నే.