హీరోయిన్ పెళ్లి గురించి తెలియదన్న తండ్రి

హీరోయిన్ పెళ్లి కబురు బయటకు రాగానే ‘అవునా..’ అంటూ సామాన్య ప్రేక్షకుడు ఆశ్చర్యపోతాడు. కుర్రాడు ఎవరు.. పెళ్లి ఎక్కడ లాంటి ఆరాలు తీస్తాడు. మరి సామాన్య జనంతో పాటు హీరోయిన్ తండ్రి కూడా ఆశ్చర్యపోతే…

హీరోయిన్ పెళ్లి కబురు బయటకు రాగానే ‘అవునా..’ అంటూ సామాన్య ప్రేక్షకుడు ఆశ్చర్యపోతాడు. కుర్రాడు ఎవరు.. పెళ్లి ఎక్కడ లాంటి ఆరాలు తీస్తాడు. మరి సామాన్య జనంతో పాటు హీరోయిన్ తండ్రి కూడా ఆశ్చర్యపోతే ఎలా ఉంటుంది? ఈ సందర్బం అలాంటిదే.

హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లికి సిద్ధమైంది. ఈనెల 23న ముంబయిలో పెళ్లి. బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ ను ఆమె పెళ్లాడబోతోంది. 2 రోజుల నుంచి బాలీవుడ్ లో ఇదే బ్రేకింగ్ న్యూస్.

ఇది తనకు కూడా బ్రేకింగ్ న్యూస్ అంటున్నారు సీనియర్ నటుడు, సోనాక్షి సిన్హా తండ్రి శత్రుఘ్ను సిన్హా. తన కూతురు పెళ్లి చేసుకుంటుందనే విషయం తనతో పాటు, తన భార్యకు కూడా తెలియదంటున్నారు.

“ఎన్నికల ఫలితాల తర్వాత నేను ఢిల్లీకి వచ్చాను. నా కూతురు పెళ్లి గురించి నన్ను అడుగుతున్నారు. నాకు తెలియదు. పెళ్లి చేసుకుంటున్నాననే విషయం సోనాక్షి నాకు చెప్పినప్పుడు, నేను, నా భార్య పూర్తి ఆశీస్సులు అందిస్తాం.”

ఈ కాలం పిల్లలు పెళ్లి కోసం తల్లిదండ్రుల నుంచి అనుమతి తీసుకోవడం లేదని, కేవలం సమాచారం మాత్రమే ఇస్తున్నారని అన్నారు సిన్హా. చూస్తుంటే.. తండ్రీకూతుళ్ల మధ్య ఈ పెళ్లికి సంబందించి ఏదో పెద్ద గొడవే జరిగినట్టుంది.

అటు సోనాక్షి మాత్రం తన పెళ్లి వివాహ పత్రికల్ని అందరికీ పంచుతోంది. పెళ్లి శుభలేఖపై ‘పుకార్లు నిజమే’ అనే క్యాప్షన్ పెట్టింది.