హీరో నితిన్ కాస్త వెనుక బడ్డాడు. సరైన రెండు సినిమాలు నిర్మాణంలో వున్నాయి. వాటితో బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం వుంది. ఒకటి వెంకీ కుడుముల డైరక్షన్ లో ‘రాబిన్ హుడ్’. రెండవది వేణు శ్రీరామ్ డైరక్షన్లో తమ్ముడు సినిమా. ఈ రెండూ సమాంతరంగా రెడీ అవుతున్నాయి.
కానీ ఈ ఏడాది ఒక్క సినిమా కూడా విడుదలకు చాన్స్ తక్కువగా వుంది. రాబిన్ హుడ్ సినిమా దాదాపుగా రెడీ అయిపోతోంది. గతంలో డిసెంబర్ అని డేట్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు అదే నెలలో పుష్ప 2 రావడం అన్నది రాబిన్ హుడ్ విడుదలను పక్కకు నెట్టింది. ఎందుకంటే రెండూ ఒకటే బ్యానర్.
నిజానికి నితిన్ రాబిన్ హుడ్ సినిమా ఈ నెలాఖరుకు షూట్ మొత్తం పూర్తి చేసుకుని రెడీ అయిపోతుంది. ఈ నెల 20 న బయలు దేరి టీమ్ అంతా అస్ట్రేలియా వెళ్తోంది. అక్కడ వర్క్ అయిపోతే సినిమా షూట్ మొత్తం అయిపోయినట్లే. ఇంకా మూడు నెలల సమయం వుంది డిసెంబర్ డేట్ కు. కానీ పుష్ప 2 వస్తే రాబిన్ హుడ్ రాదు. పుష్ప 2 రాకుంటే రాబిన్ హుడ్ వస్తుంది.
గేమ్ ఛేంజర్ సినిమా డిసెంబర్ లో వుంది. ఒక వేళ అది రాకపోతే రాబిన్ హుడ్ రావడానికి కొంచెం చాన్స్ వుంది. కానీ అలా జరుగుతుందనే నమ్మకం తక్కువే. పోనీ తరవాత డేట్ లు చూద్దాం అంటే జనవరి ఫుల్.. మార్చి పుల్.. ఇలా వుంది పరిస్థితి. మరి ఎక్కడో చిన్న గ్యాప్ చూసి సినిమా వేసేసుకోవాల్సిందే అనుకంటే మామూలు సినిమాలు కాదు. డెభై కోట్ల రేంజ్‌లో తీస్తున్న సినిమాలే. అందువల్ల డేట్ ఫిక్స్ చేయడం అంత వీజీ కాదు.
Call boy works 8341510897
Call boy jobs available 8341510897
vc available 9380537747
ఏ ఏడాది వచ్చినా మేం థియేటర్లో చూడం