హీరో నితిన్ తండ్రి అయ్యాడు. అతడి భార్య షాలిని మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా నితిన్ వెల్లడించాడు. తనకు కొడుకు పుట్టాడని చెబుతూ.. బాబు చిట్టి చేతులను, తన చేతిలోకి తీసుకున్న ఫొటోను పోస్ట్ చేశాడు.
నితిన్-షాలిని ఐదేళ్లు ప్రేమించుకున్నారు. 2020 ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా తన లవ్ మేటర్ ను బయటపెట్టాడు నితిన్. ఏప్రిల్ 16న దుబాయ్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని భావించాడు. కానీ లాక్ డౌన్ కారణంగా పెళ్లి వాయిదాపడింది. ఆ తర్వాత అదే ఏడాది జులైలో కొద్దిమంది ఆహుతుల సమక్షంలో షాలినీ మెడలో మూడుముళ్లు వేశాడు.
అలా గుంభనంగా పెళ్లి చేసుకున్న నితిన్, తన భార్య గర్భం దాల్చిన విషయాన్ని కూడా అంతే రహస్యంగా ఉంచాడు. ఇప్పుడు కొడుకు పుట్టిన విషయాన్ని సడెన్ గా ప్రకటించి షాక్ ఇచ్చాడు. సమంత, సాయిదుర్గతేజ్, వెంకీ కుడుముల, వెంకీ అట్లూరి లాంటి చాలామంది టాలీవుడ్ ప్రముఖులు నితిన్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ప్రస్తుతం నితిన్ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు తమ్ముడు సినిమా చేస్తూనే, మరోవైపు రాబిన్ హుడ్ సినిమాను కొలిక్కి తీసుకొచ్చాడు. వీటిలో రాబిన్ హుడ్ ముందుగా థియేటర్లలోకి వస్తుంది.
vc estanu 9380537747
Call boy jobs available 8341510897
Call boy works 8341510897
Population control