సరిపోదా శనివారం.. హిందీ ఏమయింది?

సరిపోదా శనివారం.. నాని పాన్ ఇండియా సినిమా. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకు ఉద్దేశించిన సినిమా. దక్షిణాది భాషల్లో విడుదల చేయడం పెద్ద విషయం కాదు. కానీ హిందీ విడుదల…

సరిపోదా శనివారం.. నాని పాన్ ఇండియా సినిమా. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకు ఉద్దేశించిన సినిమా. దక్షిణాది భాషల్లో విడుదల చేయడం పెద్ద విషయం కాదు. కానీ హిందీ విడుదల అన్నది అలా కాదు. హిందీలో ఓ సినిమా విడుదల చేయాలంటే కనీసం అయిదు కోట్లు ఖర్చు వుంటుంది. ప్రింట్లకే ఈ ఖర్చు అంతా. పైగా హిందీలో బయ్యర్లు రారు. అడ్వాన్స్ మీద విడుదల చేసి పెడతారంతే. అయినా మన హీరోలకు పాన్ ఇండియా క్రేజ్ వల్ల అలా ప్రయత్నిస్తూ వుంటారు.

నిజానికి చాలా సినిమాలు పాన్ ఇండియా అని అంటారు కానీ, అసలు చాలా సినిమాలు హిందీకి ఏ కంటెంట్ ను రెడీ చేయవు. హిందీ డబ్బింగ్ హక్కులు అమ్మేసి చేతులు దులుపుకుంటాయి.

సరిపోదా శనివారం సినిమా హిందీ నాట విడుదలకు ముందే డిసైడ్ అయ్యారు. నాని వెళ్లి ముంబాయిలో పబ్లిసిటీ చేసి వచ్చారు. కానీ హిందీలో విడుదలయ్యిందా? లేదా? అన్నది తెలియదు. లాస్ట్ మినిట్ వరకు వర్క్ పూర్తి కాకపోవడంతో హిందీ కంటెంట్ రెడీ కాలేదు. అదే సమయంలో నాలుగు వారాల్లో అంటే సెప్టెంబర్ 27న ఓటిటిలో విడుదల అన్నది లాస్ట్ మినిట్ లో ఫిక్స్ అయింది. ఇక హిందీలో ఓ వారం వెనుకగా అయినా విడుదల చేసి ఏం సాధించాలి. అదీ కాక నార్త్ ఇండియా జ‌నాలు 8 వారాల గ్యాప్ వుంటే తప్ప విడుదల కు ఓకె అనరు.

అందుకే సైలంట్ గా ఊరుకున్నారు. కేవలం సౌత్ లాంగ్వేజ్ ల్లో విడుదలచేసారు. హిందీ బెల్ట్ లో తెలుగు వాళ్లు వున్న చోట తెలుగు వెర్షన్లు వేసుకోవచ్చు. అలాగే హిందీ డబ్బింగ్ తీసుకున్నవారు ఒకటి రెండు చోట్ల హిందీ వెర్షన్ విడుదల చేసి ఊరుకున్నారు. మొత్తం మీద అవిధంగా సరిపోదా శనివారం సినిమా హిందీ విడుదల కథ ముగిసింది.

12 Replies to “సరిపోదా శనివారం.. హిందీ ఏమయింది?”

  1. ఈ ఆర్టికల్ తో సరి పుచ్చు G A…ఈ సినిమా మీద ఎన్నో ఆర్టికల్స్ రాశావు…చాలు ఇంక

  2. నాని అంటే నీకెందుకు అంత కోపం. ఈ సినిమా గురించి ఒక్క పాజిటివ్ న్యూస్ కూడా రాయలేదు

    1. సినిమా టికెట్స్ తగ్గించినపుడు నాని గారు వ్యతిరేకించినప్పటినుండి

  3. ఇంత పనికిమాలిన నెగటివ్ న్యూస్ రాసాడంటే ఇది ఖచ్చితంగా మూర్తి తాత రాసిన న్యూసే అయి ఉంటుంది

  4. గ్రేట్ ఆంద్ర అని టైటిల్ పెట్టుకొని ఆ పేరు పరువు తీస్తున్నాడు . విడి న్యూస్ లో నిజం కన్నా అబ్దం యెక్కువ ఉంటుంది, అసూయ , ద్వేషం కనపడతాయి అదే సాక్షి చానెల్ లాగా

Comments are closed.