Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఈసారి ఆ ప్రయోగం చేయనంటున్న దిల్ రాజు

ఈసారి ఆ ప్రయోగం చేయనంటున్న దిల్ రాజు

తన కొత్త బ్యానర్ పై చిన్న చిత్రాలు, ప్రయోగాత్మలు చిత్రాలు చేస్తూ కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తానని దిల్ రాజు ఇదివరకే ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మరో స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. తను తీసిన ప్రతి సినిమాను ప్రివ్యూ వేస్తానని, కొంతమందికి చూపించి వాళ్ల అభిప్రాయాలు తీసుకుంటానని తెలిపారు. అయితే ఈసారి మాత్రం దిల్ రాజు ఆ పని చేయడం లేదు.

దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా లవ్ మీ. ఇఫ్ యు డేర్ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. విడుదలకు సిద్ధమౌతోంది. అయితే గతంలో ప్రకటించినట్టు ఈ మూవీకి ప్రివ్యూలు వేయడం లేదు. నేరుగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

దీనికి ఓ కారణం ఉంది. లవ్ మీ అనేది రొమాంటిక్-హారర్ స్టోరీ. ఇంకా చెప్పాలంటే ఇది ఘోస్ట్ లవ్ స్టోరీ. చాలా కొత్త కథతో తెరకెక్కిందట. ఇలాంటి సినిమాను విడుదలకు ముందే కొంతమందికి చూపిస్తే, సినిమాలో కీలకమైన ట్విస్టులు బయటకొచ్చేస్తాయని భయపడుతున్నారు దిల్ రాజు.

అందుకే బలగం సినిమా కోసం అనుసరించిన పద్ధతిని లవ్ మీ మూవీకి అనుసరించడం లేదని స్పష్టం చేశారు. బలగం సినిమాకు ఎన్ని ప్రివ్యూలు వేశారో లెక్కలేదు. దాదాపు నెల రోజులకు పైగా ప్రివ్యూలు నడిచాయి. వివిధ వర్గాలకు చెందిన ప్రేక్షకులకు ఈ సినిమాను చూపించి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాతే విడుదల చేశారు.

అదే పద్ధతిని లవ్ మీ సినిమాకు పాటిస్తారని అంతా అనుకున్నారు. కానీ దిల్ రాజు పూర్తి స్పష్టత ఇచ్చారు. ఇదే బ్యానర్ పై 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమా తెరకెక్కుతోంది. బహుశా, ఆ మూవీకి ప్రివ్యూలు వేసే అవకాశం ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?