Advertisement

Advertisement


Home > Movies - Movie News

రాశీకి టీజర్, పాయల్ కు మాత్రం పోస్టర్

రాశీకి టీజర్, పాయల్ కు మాత్రం పోస్టర్

రీసెంట్ గా (నవంబర్ 30) రాశిఖన్నా తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. ఆమె పుట్టినరోజును వెంకీమామ టీమ్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. ప్రత్యేకంగా ఓ టీజర్ వీడియోను కట్ చేసి ఆమె పేరిట, ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ విడుదల చేసింది.

కట్ చేస్తే, ఈరోజు పాయల్ రాజ్ పుత్ పుట్టినరోజు. సో.. ఈరోజు కూడా వెంకీమామ నుంచి పాయల్ కు సంబంధించి ఏదైనా వీడియో ఉంటుందని అంతా ఎదురుచూశారు. కానీ యూనిట్ మాత్రం పాయల్ పుట్టినరోజును లైట్ తీసుకుంది. ఓ పోస్టర్ రిలీజ్ చేసి చేతులు దులుపుకుంది.

మరో వారం రోజుల్లో వెంకీమామ విడుదలుంది. ఇలాంటి టైమ్ లో పాయల్ పుట్టినరోజు వచ్చింది. సో.. ఇదే అదనుగా ఏదైనా మరో చిన్న వీడియో బిట్ లేదా సాంగ్ ను విడుదల చేస్తే బాగుండేది. సినిమాకు బజ్ కూడా పెరిగేది. 

కానీ యూనిట్ అలాంటి ప్రయత్నమే చేయలేదు. రాశిఖన్నా, పాయల్ మధ్య స్టార్ డమ్ లో చాలా తేడా ఉంది. ఆ తేడా ఇలా కనిపించింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?