ఆ మ‌ల‌యాళీ సినిమా తెలుగు రీమేక్ ఏమైంది?

మ‌ల‌యాళీ సినిమాలు భార‌తీయ సినిమాను ఆక‌ర్షిస్తున్నాయి. వ‌ర‌స పెట్టి వివిధ సినిమాల రీమేక్ లు జ‌రుగుతున్నాయి. ఈ విష‌యంలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కూడా ముందు వ‌ర‌స‌లో ఉంది. ఇప్ప‌టికే అయ్య‌ప్ప‌నుమ్ రీమేక్…

మ‌ల‌యాళీ సినిమాలు భార‌తీయ సినిమాను ఆక‌ర్షిస్తున్నాయి. వ‌ర‌స పెట్టి వివిధ సినిమాల రీమేక్ లు జ‌రుగుతున్నాయి. ఈ విష‌యంలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కూడా ముందు వ‌ర‌స‌లో ఉంది. ఇప్ప‌టికే అయ్య‌ప్ప‌నుమ్ రీమేక్ తెలుగులో జ‌రుగుతోంది. ఇక ఇదే సినిమా హిందీ వెర్ష‌న్ కూడా రూపొందుతోంది.

ఆ సంగ‌త‌లా ఉంటే.. ఇంకో మ‌ల‌యాళీ సినిమా డ్రైవింగ్ లైసెన్స్ కూడా తెలుగులో రీమేక్ కాబోతోంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయ్య‌ప్ప‌న్ రీమేక్ క‌న్నా ముందే.. డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ వార్త‌లు వ‌చ్చాయి. అయ్య‌ప్ప‌న్ ప‌ట్టాలెక్కింది కానీ, డ్రైవింగ్ లైసెన్స్ ఊసులో లేదు.

వాస్త‌వానికి అయ్య‌ప్ప‌న్, డ్రైవింగ్ లైసెన్స్ దాదాపు ఒకే త‌ర‌హా క‌థ‌లే. ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య‌న ఇగో వార్ కాన్సెప్ట్ లు. అయ్య‌ప్ప‌న్ లో ఒక చిన్న‌సైజు పొలిటీషియ‌న్ త‌న‌యుడికి, మ‌రో పోలీసాఫీస‌ర్ కు మ‌ధ్య‌న వార్ సాగితే, డ్రైవింగ్ లైసెన్స్ లో ఒక స్టార్ హీరోకీ, ఒక ట్రాఫిక్ పోలిస్ కూ మ‌ధ్య‌న ఇగో వార్ సాగుతుంది. రెండు సినిమాల్లోనూ పృథ్విరాజ్ ఒక త‌ర‌హా పాత్ర‌నే పోషించాడు.  

ఇప్పుడు ఈ డ్రైవింగ్ లైసెన్స్ సినిమా హిందీ వెర్ష‌న్ ప‌ట్టాలు ఎక్క‌నుంద‌ని తెలుస్తోంది. పృథ్విరాజ్ పాత్ర‌ను అక్ష‌య్ కుమార్ చేయ‌నున్నాడ‌ట‌. ఇక మ‌రో కీల‌క పాత్ర‌ను ఇమ్రాన్ హ‌ష్మీ చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం. ఇలా డ్రైవింగ్ లైసెన్స్ హిందీ వెర్ష‌న్ గురించి అప్ డేట్ వ‌చ్చింది.

తెలుగు వెర్ష‌న్ మాత్రం వార్త‌ల్లో లేదు చాలా నెల‌ల నుంచి. క‌థ‌ల కొర‌త‌తో, కొత్త ప్ర‌యోగాలు చేయ‌డానికి అనాస‌క్తితో ఉన్న తెలుగు స్టార్ హీరోల్లో ఎవ‌రో ఒక‌రు డ్రైవింగ్ లైసెన్స్ ను క‌చ్చితంగా రీమేక్ చేసే అవ‌కాశాలు లేక‌పోలేదు.