ఒకేసారి వచ్చాయి.. అన్నీ ఒకేసారి వెళ్లాయి

ఒకటి కాదు, రెండు కాదు.. ఈ వారం ఏకంగా 11 సినిమాలు (డైరక్ట్ ఓటీటీ రిలీజ్ తో కలిపి) రిలీజ్ అయ్యాయి. థియేటర్లన్నీ కళకళలాడాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే.. థియేటర్లు సినిమాలతో కళకళలాడాయి…

ఒకటి కాదు, రెండు కాదు.. ఈ వారం ఏకంగా 11 సినిమాలు (డైరక్ట్ ఓటీటీ రిలీజ్ తో కలిపి) రిలీజ్ అయ్యాయి. థియేటర్లన్నీ కళకళలాడాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే.. థియేటర్లు సినిమాలతో కళకళలాడాయి తప్ప, ప్రేక్షకులతో కాదు. అవును.. ఈ సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా క్లిక్ అవ్వలేదు. రిలీజై 2 రోజులు గడిచినా ఒక్క సినిమాపై కూడా మౌత్ టాక్ లేదు. రేపట్నుంచి దాదాపు అన్ని సినిమాలు ఎత్తేసే పొజిషన్ లోనే ఉన్నాయి.

ఛలో ప్రేమిద్దాం, ఊరికి ఉత్తరాన, సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి, పోస్టర్, మిస్సింగ్, రామ్ అసుర్, రావణలంక, స్ట్రీట్ లైట్, మిస్టర్ లోన్లీ, గూడుపుఠాణి.. ఇలా 10 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో ఒక్కటంటే ఒక్క సినిమాకు కూడా మంచి టాక్ రాలేదు. 

అంతకుముందు విడుదలైన రాజావిక్రమార్క, పుష్పకవిమానం లాంటి సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ చిన్న సినిమాలన్నింటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లు దొరికాయి. బాక్సాఫీస్ వద్ద మంచి స్పేస్ కూడా దొరికింది. కానీ దాన్ని ఏ ఒక్క సినిమా క్యాష్ చేసుకోలేకపోయింది.

ఇక డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కింద అద్భుతం అనే సినిమా వచ్చింది. తేజ సజ్జ, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది. మంచి కాన్సెప్ట్, మంచి సెటప్, కథాపరంగా థ్రిల్లింగ్ మూమెంట్స్ సెట్ అయినప్పటికీ.. నెరేషన్ సరిగ్గా లేక ఈ సినిమా కూడా చతికిలపడింది.

ఎప్పట్లానే థియేటర్లన్నీ ప్రేక్షకుల్లేక వెలవెలబోతున్నాయి. బహుశా ఈ వారం కూడా అదే పరిస్థితి ఉండొచ్చు. రాజ్ తరుణ్ నటించిన అనుభవించు రాజా తప్ప చెప్పుకోదగ్గ సినిమాలేవీ థియేటర్లలోకి రావడం లేదు. బహుశా, అఖండ వచ్చేవరకు బాక్సాఫీస్ నీరసంగానే ఉంటుందేమో.