నటి అవికాగోర్‌తో తనకి రహస్య రిలేషన్‌షిప్ ఉందని వస్తున్న వార్తలపై సీరియల్ నటుడు మనీశ్‌రాయ్ సింగన్ స్పష్టత ఇచ్చారు. అందరూ అనుకుంటున్నట్టు తనతో కాదని, మరొకరితో అవికాగోర్ డేటింగ్‌లో ఉన్నట్టు తేల్చి చెప్పాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘బాలికావధు’తో (చిన్నారిపెళ్లికూతురు) బాలనటిగా ముద్దుగుమ్మ అవికాగోర్ గ్లామర్ ప్రపంచానికి పరిచయం అయ్యారు. ఆ ధారావాహికతో పెద్ద సంఖ్యలో అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆ సీరియలే ఆమెని సెలబ్రిటీని చేసింది. ప్రస్తుతం సిని మాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో బిజీగా ఉన్నారామె.
‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. ప్రస్తుతం నాగచైతన్య, రాశీఖన్నా జంటగా నటిస్తున్న ‘థాంక్యూ’ చిత్రంలో అవికా కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే మెగాస్టార్ చిరు చిన్నల్లుడు కల్యాణ్‌దేవ్ హీరోగా వస్తున్న మరో సినిమాలో కూడా ఆమె నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా ‘బాలికావధు’ తర్వాత అవికాగోర్, మనీశ్ ప్రధానపాత్రల్లో ‘సస్రూల్ సిమర్ కా’ అనే ధారావాహిక వచ్చింది. ఇది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. ఈ సీరియల్‌లో అవికా – మనీశ్ మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి అందరూ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని నమ్మారు.
అంతేకాదు, వాళ్ల మధ్య సంథింగ్ సంధింగ్ అనే ప్రచారం ఎంత వరకు వెళ్లిందంటే…మనీశ్‌తో కలిసి ఆమె రహస్యంగా ఓ బిడ్డకు జన్మనిచ్చిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఇలాంటి వార్తలకు ఇకపై అవకాశం లేకుండా ఫుల్‌స్టాప్ పెట్టాలనే తలంపుతో మనీశ్ స్పందించాడు.
‘అవికా నాకు మంచి స్నేహితురాలు. ఇద్దరు వ్యక్తులు స్నేహంగా ఉంటే ఎందుకని తట్టుకోలేరు? వాళ్ల స్నేహాన్ని రిలేషన్‌షిప్‌గా మీరు ఎలా అనుకుంటున్నారు? అవికా కంటే వయసులో నేను 18 సంవత్సరాలు పెద్ద. ప్రస్తుతం తను మిలింద్ చంద్వాణీతో డేటింగ్‌లో ఉంది. వాళ్ల లైఫ్ ఎంతో సంతోషంగా ఉంది. అలాగే , గతేడాది నేను పెళ్లి చేసుకున్నా. ఇలాంటి రూమర్స్ చూసి నా భార్య నవ్వుకుంటుంది’ అని మనీశ్ వివరించారు. ఇప్పటికైనా అవికాతో మనీశ్ రిలేషిప్‌పై విష ప్రచారం ఆగుతుందేమో చూద్దాం.