సమంత నుంచి రాబోతున్న క్రేజీ ప్రాఙెక్టు యశోద. పలు కారణాల వల్ల ఆలస్యమైన ఈ ప్రాఙెక్టు ఇప్పుడు పూర్తయింది. సమంత డబ్బింగ్ ఇటు తెలుగుకు, అటు తమిళ వెర్షన్ కు కూడా పూర్తయింది. దీంతో సినిమా విడుదలకు మార్గం సుగమం అయింది.
నవంబర్ 11ను విడుదల డేట్ గా డిసైడ్ చేసారు. ఇద్దరు కొత్త దర్శకులు హరి-హరీష్ అందిస్తున్న ఈ సినిమా టీజర్ జనాలను బాగా ఆకట్టుకుంది. వైవిధ్యమైన సినిమా అనే బజ్ తెచ్చుకుంది.
దాంతో సినిమా థియేటర్ హక్కులు హోల్ సేల్ గా అమ్ముడుపోయాయి. అలాగే డిజిటల్ హక్కులను అమెజీన్ మంచి రేటుకు తీసుకుంది. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో తయారవుతోంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
సమంత కు మంచి పేరు రావడంలో ఆమెకు డబ్బింగ్ చెప్పిన చిన్మయి శ్రీపాద వాయిస్ పాత్ర కూడా వుంది. కానీ యశోద సినిమాకు రెండు భాషల్లో సమంతనే స్వంతగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.