ఎన్టీఆర్ వచ్చాడంట.. వాళ్లకింకా ఆశ చావలేదుగా!

స్పందించే ఉద్దేశం ఉంటే ఎప్పుడో స్పందించేవాడు. కానీ ఎన్టీఆర్ కు ఆ ఉద్దేశం లేదు. అందుకే ఓ వైపు చంద్రబాబు అరెస్ట్ అయినా ఆయన ఎంచక్కా తన సినిమా షూటింగ్ కు వెళ్లాడు, ఆ…

స్పందించే ఉద్దేశం ఉంటే ఎప్పుడో స్పందించేవాడు. కానీ ఎన్టీఆర్ కు ఆ ఉద్దేశం లేదు. అందుకే ఓ వైపు చంద్రబాబు అరెస్ట్ అయినా ఆయన ఎంచక్కా తన సినిమా షూటింగ్ కు వెళ్లాడు, ఆ తర్వాత అట్నుంచి అటు అవార్డ్ అందుకోవడానికి దుబాయ్ వెళ్లాడు.

ఇప్పుడు ఆ కార్యక్రమం ముగించుకొని హైదరాబాద్ తిరిగొచ్చాడు తారక్. ఈసారి తారక్ కచ్చితంగా చంద్రబాబు అరెస్ట్ పై స్పందిస్తాడంటున్నారు టీడీపీ సానుభూతిపరులు. ఇంతకంటే అమాయకత్వం ఉంటుందా? ఆయన స్పందన కోసం ఎందుకంత ఆరాటం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కూడా టీడీపీలో కలిపేసుకోవాలనే తాపత్రయమే ఇదంతా.

ఎన్టీఆర్ కు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదు. అందుకే ఆయన అన్నింటికీ దూరంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ గా ఏం జరిగినా అది ఆయనకు అనవసరం. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఎన్టీఆర్ విషయంలో అవకాశవాద రాజకీయాల కోసం చూస్తోంది.

ఇన్నాళ్లూ రాజకీయంగా తారక్ ను దూరం పెట్టిన ఆ పార్టీ, ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయ్యేసరికి ఎన్టీఆర్ వైపు ఆశగా చూస్తోంది. ఎన్టీఆర్ ప్రకటన చేస్తే, సింపతీ కొట్టేద్దామని అర్రులుచాస్తోంది. ఇలాంటివి చాలా చూశాడు తారక్. పైగా భువనేశ్వరి ఎపిసోడ్ లో ఏం జరిగిందో కూడా తనకు వ్యక్తిగతంగా అనుభవమే. అందుకే ఏపీ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నాడు.

ఎన్టీఆర్ కోసం 'దేవర' ఎదురుచూస్తోంది. ఆ మూవీ కొత్త షెడ్యూల్ లో త్వరలోనే జాయిన్ అవుతాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ అవ్వాలి. ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ ముందున్న లక్ష్యం. మిగతావన్నీ అనవసరం.