రాజమౌళి.. సినిమా కాదు డాక్యుమెంటరీ!

ఉన్నట్లుండి ఓ వార్త. రాజమౌళి ఓ భారీ సినిమా చేస్తున్నారు అని. తాను ప్రెజెంట్… రమా రాజమౌళి కుమారుడు నిర్మాత. వేరే దర్శకుడు పని చేస్తారు అంటూ. ఈ వార్త ను ముందుగా ఓ…

ఉన్నట్లుండి ఓ వార్త. రాజమౌళి ఓ భారీ సినిమా చేస్తున్నారు అని. తాను ప్రెజెంట్… రమా రాజమౌళి కుమారుడు నిర్మాత. వేరే దర్శకుడు పని చేస్తారు అంటూ. ఈ వార్త ను ముందుగా ఓ ఇంటర్నేషనల్ వెబ్ సైట్ కు లీక్ ఇచ్చారు. అది చూసి మనవాళ్లంతా.. డిటో.. డిటో అన్నారు. 

కానీ ఇప్పటి వరకు ఏమిటి? అన్నది ఫుల్ క్లారిటీ ఎవరికీ లేదు. విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం, రాజమౌళి సమర్పిస్తున్నది థియేటర్ సినిమా కాదు అని తెలుస్తోంది.

డిజిటల్ యాప్స్ కోసమో, మరే విధంగా బ్రాడ్ కాస్ట్ చేయడం కోసమో, ఓ డాక్యుమెంటరీ ఇండియన్ సినిమా మీద చేయాలన్నది ఆలోచనగా చెబుతున్నారు. ఇది బయోపిక్ అని అంతా అన్నారు కానీ, బయోపిక్ ల మాదిరిగా థియేటర్ ఫార్మాట్ లో వుండదని తెలుస్తోంది. ఓటిటి సంస్థలు ఇలాంటి డాక్యుమెంటరీలు చేస్తూ వుంటాయి. ఇప్పటికే చాలా చేసాయి కూడా.

ఒకటి మాత్రం వాస్తవం. మహేష్ బాబుతో చేయబోయే సినిమా తరువాత రాజమౌళి ఇక పై బ్యానర్లకు సినిమాలు చేయరన్నది విశ్వసనీయ వర్గాల బోగట్టా. కొడుకు కార్తికేయ, మిత్రుడు సాయి కొర్రపాటి సహకారంతో సినిమాలు తానే స్వంతంగా నిర్మించుకుంటారని తెలుస్తోంది.