ఎన్టీఆర్ సినిమాకు ఇంకా చాలా సమయం?

ఎన్టీఆర్..కొరటాల శివ సినిమా అసలు వుంటుందా? వుంటే ఎప్పుడు వుంటుంది? అన్నది మిలియన్ డాలర్ల క్వశ్చనుగా మారుతోంది. ఇన్నాళ్లూ ఆషాఢమాసం అని, కథ ఇంకా సెకండాఫ్ లాక్ కావాలనీ, కాదు కాదు హీరోయిన్ దొరకాలి…

ఎన్టీఆర్..కొరటాల శివ సినిమా అసలు వుంటుందా? వుంటే ఎప్పుడు వుంటుంది? అన్నది మిలియన్ డాలర్ల క్వశ్చనుగా మారుతోంది. ఇన్నాళ్లూ ఆషాఢమాసం అని, కథ ఇంకా సెకండాఫ్ లాక్ కావాలనీ, కాదు కాదు హీరోయిన్ దొరకాలి అని ఇంకో సారి అలా రకరకాల కబుర్లు వినిపిస్తూ వస్తున్నాయి. 

మొత్తానికి త్వరలో షూట్ వుంటుందని నిర్మాతల్లో ఒకరైన కళ్యాణ్ రామ్ కూడా చెప్పారు. కానీ పరిస్థితులు గమనిస్తుంటే మరో ఆరు నెలల వరకు షూట్ స్టార్ట్ అవుతుందా అని అనుమానంగా వుంది.

ఎందుకంటే కొరటాల స్క్రిప్ట్ రెడీ చేయాలి. హీరోయిన్ దొరకాలి. ఇవన్నీ ఒక ఎత్తు. ఎన్టీఆర్ మేకోవర్ కావాల్సి వుంటుందని అంటున్నది మరో ఎత్తు. నిన్నటికి నిన్న జరిగిన బింబిసార ఫంక్షన్ లో ఎన్టీఆర్ ను చూసిన వారు అనుకుంటున్న మాట ఇది. ఎన్టీఆర్ కాస్త ఒళ్లు చేసారు. మొహం బాగా పెద్దగా కనిపిస్తోంది. బాడీ కూడా దానికి తగ్గట్లు పెద్దగా వుంది. ఈ ఫిజిక్ తో తెరమీద కనిపిస్తే అంత బాగుంటుందా? అన్నది అనుమానం

ఆర్ఆర్ఆర్ లో భీమ్ పాత్ర కాబట్టి ఆ ఫిజిక్ పెర్ ఫెక్ట్ గా సరిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ డ్యూయట్లు, ఫన్ అన్ని వేరియేషన్లు చూపించాలి సినిమాలో. అలా చేయాలి అంటే ఎన్టీఆర్ ఫిజిక్ బాగా తగ్గాలి అని అనిపిస్తోంది. అందువల్ల ఎన్టీఆర్ జిమ్ స్టార్ట్ చేసి, మేకోవర్ కావాలనుకుంటే కనీసంలో కనీసం మూడు నెలలు పడుతుంది.

చూస్తుంటే ఇప్పట్లో ఎన్టీఆర్ సినిమా ప్రారంభం కావడానికి అవకాశం తక్కువే అనిపిస్తోంది. లేదా ఎన్టీఆర్ పక్కా పాన్ ఇండియా చేయాలని అనుకుంటున్నారు కనుక, కొరటాల ను పక్కన పెట్టి ప్రశాంత్ నీల్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఏమో? ఏం జరుగుతుందో? మరి?