ఎన్నడూ లేనిది తొలిసారి హనుమాన్ దీక్ష తీసుకున్నారు నందమూరి తారక రామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్. ఇది కాస్త ఆశ్చర్యమే.
ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్టీఆర్ ను ఈ తరహా గెటప్ లో చూసింది లేదు. మిగిలిన హీరోలు అంతా ఎప్పుడో అప్పుడు ఏదో దీక్ష తీసుకున్నవారే. సినిమా జనాలకు దైవ భక్తి ఎక్కువే. సెంటిమెంట్లు ఎక్కువే. అది ఎప్పటికప్పుడు బయటపడుతూ వుంటుంది కూడా.
కానీ ఎన్టీఆర్ విషయం వేరు. తిరుపతి కూడా రేర్ గా వెళ్తుంటారు. అంతకు మించి పూజలు, దీక్షలు చేసిన దాఖలాలు ఇప్పటివరకు కనిపించలేదు. అలా అని ఆయనేమీ నాస్తికుడు కారు. అలాంటిది తొలిసారి హనుమాన్ దీక్ష తీసుకోవడానికి కారణం ఏమిటి? జాతకం ప్రకారం ఎవరైనా సూచించారా?
ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు రామ్ చరణ్. ఏడాది పొడవునా ఏదో దీక్షలో వుంటూనే వుంటారు. మరి ఆయన ఏమన్నా సూచించారా? ఈ దీక్ష చేస్తే మంచిది అని? ఎన్టీఆర్ తల్లి, భార్య కూడా దైవ భక్తి విషయంలో కాస్త గట్టి నమ్మకాలు వున్నవారే. మరి వారేమైనా చెప్పారా?
కానీ ఎన్టీఆర్ వరకు తల్లి, భార్య చెప్పేంత అవకాశం తక్కువ. ఆయన తన నిర్ణయాలు తానే తీసుకుంటారు. చరణ్ చెప్పి వుండాలి. లేదా ఎవరైనా పండితులు మంచిది అని సూచించి వుండాలి అనే కామెంట్లు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.