2 రోడ్డు ప్రమాదాలు.. ఎన్టీఆర్ భావోద్వేగం

హీరో ఎన్టీఆర్ మరోసారి భావోద్వాగానికి లోనయ్యాడు. రోడ్డు ప్రమాదాలు తన జీవితాన్ని, తన కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేశాయో మరోసారి చెప్పుకొచ్చాడు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వార్షికోత్సవ సమావేశానికి ప్రత్యేక అతిథిగా హాజరైన తారక్..…

హీరో ఎన్టీఆర్ మరోసారి భావోద్వాగానికి లోనయ్యాడు. రోడ్డు ప్రమాదాలు తన జీవితాన్ని, తన కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేశాయో మరోసారి చెప్పుకొచ్చాడు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వార్షికోత్సవ సమావేశానికి ప్రత్యేక అతిథిగా హాజరైన తారక్.. తన కుటుంబంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్ని తలుచుకొని భావోద్వేగానికి లోనయ్యాడు.

“నేను ఇక్కడికి ఓ నటుడిగా రాలేదు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన ఓ పౌరుడిగా వచ్చాను. మా అన్నయ్య జానకీరామ్ ఎంతో జాగ్రత్తపరుడు. చిన్నప్పుడు మేం అప్పుడప్పుడు కార్లు, బైక్స్ నిర్లక్ష్యంగా నడిపి ఉండొచ్చు. కానీ అన్నయ్యా మాత్రం చాలా జాగ్రత్తపరుడు. రాంగ్ రూట్ లో ట్రాక్టర్ రావడం వల్ల ఆయన మరణించారు. 

ఇక రెండోది మా నాన్నగారు హరికృష్ణగారు. మా తాతగారికి ఒక్క ప్రమాదం జరగకుండా, ఎంతో జాగ్రత్తగా 33వేల కిలోమీటర్ల పర్యటనను పూర్తిచేశారు మా నాన్నగారు. అలాంటి వ్యక్తి  కూడా ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ రోడ్డు ప్రమాదానికి గురై, మమ్మల్ని వదిలి వెళ్లారు.”

ఇలా తన అన్నయ్య, తండ్రిని మరోసారి గుర్తుచేసుకున్నాడు ఎన్టీఆర్. ఇంటి నుంచి బయటకొచ్చేటప్పుడు.. వాహనాన్ని నడుపుతున్నప్పుడు తల్లిదండ్రుల్ని, భార్యపిల్లల్ని గుర్తుచేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు తారక్. నిబంధనల్ని కఠినంగా అమలు చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గవంటున్న ఎన్టీఆర్.. ప్రతి వాహనదారుడు తననుతాను సంస్కరించుకొని, బాధ్యతతో ఉన్నప్పుడు మాత్రమే ప్రమాదాలు తగ్గుతాయన్నాడు

కరోనా లాంటి భయంకరమైన వ్యాధికి కూడా వ్యాక్సిన్ ఉంది కానీ.. రోడ్డు ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి వాక్సిన్లు లేవు కాబట్టి.. ప్రతి ఒక్కరు రోడ్డుపై బాధ్యతగా వ్యవహరించాలని.. పోలీసుల్ని ప్రతి ఒక్కరు గౌరవించాలని కోరాడు తారక్.  

Click Here For Photo Gallery

డైవర్ట్‌ పాలిటిక్స్‌ చేయడం బాబు, లోకేష్‌కు అలవాటు

షీ హేజ్ టు గో ఎ లాంగ్ వే