ఎన్టీఆర్ కు అండర్ వాటర్ ట్రయినింగ్

చాలా సీరియస్‌గా, ప్రశాంతంగా, సైలంట్‌గా జరిగిపోతోంది దేవర సినిమా షూట్. ఆచార్య సినిమా ఫెయిల్యూర్ అంతా తన నెత్తిన వేసి, తనను బదనామ్ చేసినందుకు కసిగా వున్నారు దర్శకుడు కొరటాల.  ఆచార్య మినహా బ్లాక్…

చాలా సీరియస్‌గా, ప్రశాంతంగా, సైలంట్‌గా జరిగిపోతోంది దేవర సినిమా షూట్. ఆచార్య సినిమా ఫెయిల్యూర్ అంతా తన నెత్తిన వేసి, తనను బదనామ్ చేసినందుకు కసిగా వున్నారు దర్శకుడు కొరటాల.  ఆచార్య మినహా బ్లాక్ మార్క్ లేని తను మరోసారి తనేంటో చూపిస్తా అనే పట్టుదలతో పని చేస్తున్నారు. రాజమౌళి సినిమా చేసిన తరువాత ఆ హీరో పని కొన్నాళ్ల పాటు కష్టం అనే సెంటిమెంట్‌ను పక్కకు పెట్టించి, కొత్త రికార్డు సృష్టించాలనే తపనతో వున్నారు హీరో ఎన్టీఆర్.

ఇప్పుడు ఇద్దరూ కలిసి దేవర సినిమాను చాలా సైలంట్‌గా తెరకెక్కిస్తున్నారు. అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదు. చకచకా చేస్తున్నారు. అయినా ‘శరవేగంగా సాగిపోతోంది.. నెల రోజులకు పది రోజుల్లో తీసేస్తున్నారు’ అని ఎక్కడా పొరపాటున కూడా డబ్బా కొట్టించడం లేదు. 

ఈ సినిమా చాలా వరకు సముద్రం బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. సముద్రం మీద కీలక సన్నివేశాలు వున్నాయి. వాటిలో ఒకటి రెండు అండర్ వాటర్ లో కూడా వుంటాయి. సినిమాకు సిజి వర్క్ లు ఎంత ఎక్కువ వున్నా, కొంతయినా అండర్ వాటర్ లో షూట్ చేయాల్సి వుంటుంది.

అందుకే ఈ సీన్ల కోసం హీరో ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన ట్రయినింగ్ ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఈ సీన్ల కోసం ముంబాయి నుంచి ట్రయినర్లను రప్పించారని తెలుస్తోంది. వారితో శిక్షణ జరుగుతోంది యూనిట్ వర్గాల బోగట్టా. సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా రాబోయే సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.