ఎన్టీఆర్ ఒంటరి అవుతున్నారా?

ఎంత టాప్ హీరో అయినా ఒక తోడు అవసరం. తన తరపున వ్యవహారాలు చక్కబెట్టడానికి, తన లైనూ లెంగ్తూ చూసుకోవడానికి, ఇలా ఒటి కాదు. అన్నీ చూసుకోవడానికి ఓ సరైన మనిషి వుండాలి. ఒకప్పుడు…

ఎంత టాప్ హీరో అయినా ఒక తోడు అవసరం. తన తరపున వ్యవహారాలు చక్కబెట్టడానికి, తన లైనూ లెంగ్తూ చూసుకోవడానికి, ఇలా ఒటి కాదు. అన్నీ చూసుకోవడానికి ఓ సరైన మనిషి వుండాలి. ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు ఇలాంటి అవసరం మరీ ఎక్కువ కనిపిస్తోంది. ముఖ్యంగా టాప్ రేంజ్ హీరోలకు. 

మహేష్ కు ఇలాంటి తోడు నమ్రత రూపంలో వుంది. బన్నీ కి అందరికీ తెలిసిన బన్నీ వాస్ వున్నారు. ప్రభాస్ కు యువి వంశీ వుండనే వున్నారు. రామ్ చరణ్ సంగతికి వస్తే ఉపాసన రావడానికి ముందు వెనుక అన్నట్లు తేడా క్లారిటీగా కనిపిస్తుంది. మెగాస్టార్ కు జికె వున్నారు. పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ వున్నారు. మరి ఎన్టీఆర్ కు ఎవరు వున్నారు? సోదరుడు కళ్యాణ్ రామ్ బంధువు హరి వున్నారు అని అంటారు కానీ అది కేవలం ఫైనాన్సియల్ మ్యాటర్స్ వరకే అని కూడా వినిపిస్తోంది.

సరైన ప్లానింగ్ లేదు. సరైన సోషల్ మీడియా వింగ్ లేదు. ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో వుండగానే రామ్ చరణ్ కు శంకర్ సినిమా వచ్చేసింది..మొదలైపోయింది. ఎన్టీఆర్ అలా ప్లాన్ చేసుకోలేకపోయారు. రాజ‌మౌళి సినిమా తరువాత ఎలాంటి సినిమా వుండాలి అన్న దాంట్లో చరణ్ ప్లాన్ చేసుకున్నట్లు ఎన్టీఆర్ ప్లాన్ చేసుకోలేకపోయారు. కొరటాలకు ఇచ్చిన మాటకు కట్టుబడడం వరకు ఒకె. కానీ పాన్ ఇండియా ఇమేజ్ ను పెంచే విషయంలో ఆ నిర్ణయం ఎంత వరకు దోహదం చేస్తుందో చూడాలి.

సోషల్ మీడియా లో ఎన్టీఆర్ బాగా వెనుకబడిపోయారు. ముందుకు ఇక్కడ సవరణలు అవసరం. చరణ్ తరపున ముంబాయి ఏజెన్సీ బలంగా పని చేస్తోంది. ఉపాసన తన కార్పొరేట్ పీఆర్ స్కిల్స్ ను గట్టిగా వాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో రామ్ చరణ్ కు సంబంధించి ప్రతీదీ వార్తగానే మలుస్తోంది ముంబాయి ఏజెన్సీ. ఎన్టీఆర్ విషయంలో ఆ లోటు క్లియర్ గా వుంది. ఎన్టీఆర్ అమెరికా టూర్ కు చరణ్ టూర్ కు తేడా క్లియర్ గా తెలిసిపోయింది. అలాగే ఏం చేస్తే వార్తల్లో పాజిటివ్ గా వుంటామో అన్నది ఎన్టీఆర్ అస్సలు పట్టించుకోవడం లేదు.

సోషల్ మీడియాలో మహేష్, బన్నీ వున్నంత ప్రభావవంతంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వుండలేకపోతున్నారు అంటే కారణం అభిమానుల తప్పు కాదు. వెనుక వుండి వారికి బలాన్నిచ్చే వారు లేకపోవడం. ఫ్యాన్స్ ను ఆర్గనైజ్ చేయాలి. సోషల్ మీడియాను ఆర్గనైజ్ చేయాలి. మీడియాలో ఎన్టీఆర్ సంగతులు చూసుకోవాలి. ఇవన్నీ ఓ పక్క…సరైన ప్లానింగ్..సరైన సినిమాలు వుండాలి మరోపక్క.

ఇవన్నీ చేయడానికి ఎన్టీఆర్ కు తగిన సచివుడు..మంత్రి…సహాయకుడు వున్నట్లు మాత్రం కనిపించడం లేదు.