Advertisement

Advertisement


Home > Movies - Movie News

సాయి థరమ్ తప్పించుకున్నారు

సాయి థరమ్ తప్పించుకున్నారు

కథలు వినడం కాదు..వాటిని జ‌డ్జ్ చేయాలి. బాగా లేకుంటే మొహమాట పడకూడదు. లేదూ అంటే ఫ్లాప్ పలకరించి కెరీర్ దెబ్బతింటుంది. అవసరాల శ్రీనివాస్ కథకు మొహమాట పడ్డాడు హీరో నాగశౌర్య. రెండు సినిమాలు తనతో చేసారు అన్న మొహమాటం. కానీ గమ్మత్తేమిటంటే అలాంటి నాగశౌర్య పేరునే ప్రమోషన్ ఫంక్షన్లలో వేదిక మీద చెప్పడానికి ఇష్టపడలేదు అవసరాల శ్రీనివాస్. అది వేరే సంగతి.

ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి అన్నది ఓ టిపికల్ సినిమా. కథ కన్నా కథనం కీలకం. ఇలాంటి కథను ఒప్పుకోవడం ఓ విధంగా రిస్క్ నే. సినిమాలో హీరోయిన్ ఎంత ఏజ్ గ్యాప్ లు వున్నా ఒకేలా కనిపిస్తూ వుంటుంది. 

హీరో మాత్రం ఏకంగా వేరు వేరు గెటప్ ల్లో వయసు మారుతూ కనిపిస్తాడు. దీని కోసం శౌర్య బోలెడు శ్రమ తీసుకోవాల్సి వచ్చింది. బోలెడు కాల్ షీట్లు వేస్ట్ చేసుకుని గెడ్డం పెంచుతూ, తగ్గిస్తూ కాలం గడపాల్సి వచ్చింది. కానీ ఫలితం లేకపోయింది.

ఈ కథ ముందుగా మరెవరెవరి దగ్గరకు వెళ్లిందో తెలియదు కానీ సాయి ధరమ్ తేజ‌ దగ్గరకు మాత్రం వెళ్లింది. ఫస్ట్ సిటింగ్ లోనే నో చెప్పేసాడు హీరో. అదీ..ఆ క్లారిటీ, ఆ నిర్మొహమాటం వుండాలి. అది లేకపోతే కష్టం. 

అన్నట్ల ఇదే మొహమాటం నిర్మాతల పీపుల్స్ మీడియా కూడా అలవర్చుకోవాలి. కేవలం చకచకా సినిమాలు చేసేద్దాం అని కాకుండా దర్శకులు..కథలు..అవకాశాలు..ఇవన్నీ చూడాలి. అదృష్టం అన్ని వేళలా వెన్నంటి వుండదు.

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా